Jan 01,2023 23:43

అనకాపల్లిలో మంత్రి అమర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న పోలీస్‌ అధికారులు


ప్రజాశక్తి.-అనకాపల్లి : అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టికి వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవో చిన్నికృష్ణ, ఉద్యోగులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఉపాధ్యాయులు, కిందిస్థాయి ఉద్యోగులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జేసి కల్పనా కుమారి, డిఆర్‌ఓ వెంకటరమణ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు.
నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాల వద్ద సందడి
అనకాపల్లి : నూతన సంవత్సర వేడుకలు నేపథ్యంలో వివిధ రాజకీయ నాయకుల ఇల్లు, కార్యాలయాలు సందడిగా మారాయి. పెద్ద ఎత్తున పార్టీల నాయకులు కార్యకర్తలు, అధికారులు అనధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు తరవచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఎంపిపి గొర్లి సూరిబాబు, కసింకోట జెడ్‌పిటిసి దంతులూరి శ్రీధర్‌రాజు, అన్నపూర్ణ బ్యాంకు చైర్మన్‌ పిడి గాంధీ, కసింకోట మండల పార్టీ అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీనివాసరావు, ఎంపిపికలగా లక్ష్మి గున్నయ్య నాయుడు, శంకరం గ్రామ సర్పంచ్‌ పసుపులేటి లక్ష్మి రామకృష్ణ, అనకాపల్లి ఎంపిడిఒ చంద్రశేఖర్‌, డిఎస్‌పి బి సునీల్‌, సిఐలు మోహనరావు, రవికుమార్‌, ఎపిఐఐసి జెడ్‌ఎం త్రినాథ్‌, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీధర్‌, ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
రింగ్‌రోడ్‌లోని టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో టిడిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావుకు పార్టీ శ్రేణులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మాడుగుల ఇన్చార్జ్‌ పివిజి కుమార్‌, చోడవరం ఇన్చార్జి బత్తుల తాతయ్య బాబు, ఎలమంచిలి ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు, పైలా ప్రసాదరావు, గూనూరు మల్లు నాయుడు, ఎలక మల్లి బాబు, ఉగ్గిన రమణమూర్తి, డాక్టర్‌ నారాయణరావు, కాయల మురళి, కుప్పిలి జగన్మోహన్‌, కోట్ని రామకృష్ణ పాల్గొన్నారు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు స్వగహంలో, కొణతాల సుబ్రహ్మణ్యం ఘాట్లో మాజీ మంత్రి కొణతాల రామకష్ణలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మండల పరిషత్‌ అధ్యక్షులు గొర్లి సూరిబాబు ఇంటి వద్ద, ఎంపీపీ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అధికారులు, అనధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. వైసిపి పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, జీవీఎంసీ 82 వార్డు కౌన్సిలర్‌ మందపాటి సునీత స్వగృహంలో వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలియజేశాయి.
ఎంపీ సత్యవతికి ఐద్వా నేతల శుభాకాంక్షలు
అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బి వి సత్యవతికి ఎంపీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ అరుణ ఆధ్వర్యంలో ఐద్వా నేతలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేరళలో ఈనెల 6 నుంచి 9 వరకు జరిగే ఐద్వా అఖిలభారత మహాసభల వివరాలను ఎంపీకి వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ మహిళల సమస్యలపై పోరాటాలు చేస్తున్న ఐద్వా కృషిని అభినందించారు. కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి సుభాషిని, సిహెచ్‌ రూపాదేవి, వివి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎంవీఆర్‌ ఇంట సందడి
అనకాపల్లి : ప్రముఖ వ్యాపారవేత్త, ముత్యాల గ్రూప్‌ ఆఫ్‌ ఇండిస్టీస్‌ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావుకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలువురు నాయకులు నరసింగరావుపేట ఎంవిఆర్‌ స్వగహంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎంవిఆర్‌ ఆకాంక్షించారు. ఎంవిఆర్‌ యువసేన, అభిమానులు పాల్గొన్నారు.
కె.కోటపాడు: తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గం సీనియర్‌ నాయకులు పైలా ప్రసాదరావుకు మండలంలోని తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్ఛాలను అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు..