ఘనంగా మున్సిపల్ చైర్మన్ పుట్టినరోజు వేడుకలు
ప్రజాశక్తి - నందికొట్కూరు
నందికొట్కూరు పట్టణంలోనే మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చైర్మన్ తన స్వగహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులు నంద్యాల జిల్లా షాప్ కోఆర్డినేటర్ స్వామి దాస్ రవికుమార్, వైసీపీ నాయకులు, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి, చైర్మన్ దంపతులకు శాలువులతో పాటు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏబిఎం పాలెంకు చెందిన కౌన్సిలర్ కాటేపోగు చిన్న రాజు, వైసిపి నాయకులు మార్కెట్ రాజు, పట్టణ నిరాశ్ర యుల వసతి గృహం నందు వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దంపతులు అర్షపోగు ప్రశాంతి, బొల్లెద్దుల రామకృష్ణ, చిన్నికృష్ణ, వైసిపి ఏబీఎం యూత్ కిషోర్, ఎర్రన్న, సురేస్,ప్రవీణ్,సతీష్,తదితర నాయకులు పాల్గొన్నారు.










