
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి 50వ జన్మదిన వేడుకలు బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు అట్టహసంగా నిర్వహించారు. జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో కేకుకట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్, ఆర్‌డిఒ కోదండరామిరెడ్డి, డిఎస్‌పి జి.శివభాస్కర్‌రెడి, పాల్గొన్నారు. నిమ్మనపల్లి: జగన్ జన్మదిన వేడుకలను మండల ఎంపిపి నరసింహులు, ఆర్బికే చైర్మన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిట్టావాండ్లపల్లిలో సర్పంచ్ రెడ్డమ్మ నరేంద్రరెడ్డి, నిమ్మనపల్లి, తవళంలో వైసిపి నాయకులు ఆధ్వర్యంలో సిఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుబ్రమణ్యం, శంకర, గంగాధర, రవి, చంద్ర, యుగంధర్ రెడ్డి, డవ్ నాగరాజా, దొర, మౌలాలి పాల్గొన్నారు. కలికిరి:స్థానిక క్రాస్ రోడ్‌లో ఎంపిపి నూర్జహం, జడ్‌పిటిసి పద్మజా లోకవర్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి, ముస్లిం మైనార్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్, గనుల శాఖ డైరెక్టర్ హరీష్ రెడ్డి, సీనియర్ నాయకులు అఘ మొహిద్దిన్, నల్లారి తిమ్మారెడ్డి, సర్పంచ్ వెంకటరెడ్డి, గంగయ్య, ఎస్టిడి హరి పాల్గొన్నారు. కలకడ :జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి శ్రీదేవి రవికుమార్, కలికిరి మార్కెటింగ్ యార్డ్ కమిటీ చైర్మన్ రవి కుమార్‌రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ కమలాకర్ రెడ్డి సర్పంచ్ రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. కొత్తకోట : పట్టణంలోని భవిత కేంద్రం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పిల్లలకు పండ్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు ఫయాజ్, భవిత సిబ్బంది నక్కా మహేష్ కుమార్, రామకష్ణ, సంకు సబ్జీ, పవన్, తుపాకుల ఉమ, సుభాన్, శశి భూషణ్, వెంకట నారాయణ పాల్గొన్నారు. గుర్రంకొండ: మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయంలో మండల కన్వీనర్ ముక్తియార్ అలీఖాన్, మండల ప్రత్యేక ఆహ్వానితులు యోగేంద్ర ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపిపి సీతమ్మ, జడ్‌పిటిసి సమ్రిన్ ముక్తియార్ అలీఖాన్, ఎఒ నాగ శివారెడ్డి, నాయకులు సాంబశివారెడ్డి, సుబ్బయ్య, ఆదినారాయణ, శంకర పాల్గొన్నారు. పీలేరు: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జివి శ్రీనాథరెడ్డి, రాష్ట్ర మైనారిటీ కమీషన్ ఛైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్, ఎపిఎండిసి డైరెక్టర్ హరీష్ రెడ్డి మెగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ డాక్టర్ షేక్ హబీబ్ బాష, జడ్పీటిసి రత్న శేఖర్ రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు ఎస్‌ఎండి షఫీ, మొహిద్దీన్, ఏఎంసి ఛైర్మన్ కడప గిరిధర్ రెడ్డి, వైస్ ఎంపిపిలు హరిత, వెంకటాచలపతి, మండల కన్వీనర్ దండు జగన్మోహన్‌రెడ్డిపాల్గొన్నారు. మదనపల్లె అర్బన్: పట్టణంలోని 14 వార్డులో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్‌ఎ కరీముల్లా, వార్డు కౌన్సిలర్ షబానా, ఇరిగేషన్ డైరెక్టర్ దండాల రవిచంద్ర రెడ్డి, వైఎస్‌ఆర్సిపి కార్యకర్తలు రమాదేవి, ఎర్రంరెడ్డి, సుమియా పాల్గొన్నారు. వాల్మీకిపురం: సర్పంచ్ గంగులమ్మ, ఉప సర్పంచ్ కేశవరెడ్డి, సింగల్‌విండో అధ్యక్షులు రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో జగన్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. వైసిపి మైనార్టీ నాయకులు అబ్దుల్ కలీమ్, సైఫుల్లా, ఇలియాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి వెంకట్రమణ, నాయకులు చింతల ఆనంద రెడ్డి, నరసింహులు, ఆనంద, మునిభాస్కర్, సాధిక్, రాయుడు, రఘు, షాహెద్, శ్రీనాథ రెడ్డి, సుధాకర్ రెడ్డి, లక్ష్మినారాయణ రెడ్డి, చెంగల్ రెడ్డి, మెంబర్ శీనా, ఫారుఖ్ పాల్గొన్నారు.తంబళ్లపల్లి :మండల కేంద్రంలో వైసిపి మండల కన్వీనర్ చౌడేశ్వర్ మండలాభివద్ధి కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి మండల ప్రత్యేక ఆహ్వానితువులు చిన్న రెడ్డి, కోటిరెడ్డిల ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ నీలుఫర్, జమాల్ భాష, పద్మనాభరెడ్డి, రామ్మూర్తి, చంద్రశేఖర్, కరీం, వెంకటరమణారెడ్డి, మెడికల్ షాప్ నారాయణరెడ్డి పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్: జగన్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే నవాజ్బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జడ్పీ హైస్కూల్‌లో రక్త దాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్ పర్సన్ మనుజా, వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, శమీమ్ అస్లమ్, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నందలూరు: జగన్ జన్మదిన వేడుకలను ఎంపిపి మేడా విజయ భాస్కర్ రెడ్డి, జిల్లా వక్స్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్ ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో సర్పంచులు, ఎంపీటీసీలు, వైసిపి నాయకులు, విద్యార్థులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ జంబు సూర్యనారాయణ, ఎంపీటీసీ అనుదీప్, వైసీపీ నాయకులు గుణ యాదవ్, శైల కుమార్, ఆర్ముగం విశ్వనాధ్, ఓర్సు శ్రీనివాసులు, మన్సూర్ పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : ఎంపిపి సంఘం అధ్యక్షులు మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపిపి అంబాబత్తిన రెడ్డయ్య ఆధ్వర్యంలో సిఎం పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సమరసింహారెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ అమీర్, గంగమ్మ ఆలయ చైర్మన్ నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షాజహాన్, ఎంపీటీసీ సభ్యులు దస్తగిరి, లక్ష్మీనారాయణ, జగన్మోహన్ రెడ్డి, శంకర్ నాయుడు, సర్పంచులు వెంకటనారాయణ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,వెంకటరమణ, రమణయ్య, మాజీ సర్పంచులు రామచంద్ర, కొండా ప్రసాద్ రెడ్డి, దుర్గయ్య, ఉప సర్పంచ్ రాజారెడ్డి పాల్గొన్నారు. పుల్లంపేట : మండల పరిధిలోని జాగువారిపల్లె సచివాలయంలో జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాయచోటి టౌన్ : పట్టణంలో సిఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను స్ధానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వైసిపి జిల్లా నాయకులు బేపారి మహమ్మద్‌ఖాన్ స్వయంగా రక్తదానం చేశారు. శ్రీసాయి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్తులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్‌బాష, వైస్ చైర్మన్ ఫయాజూర్ రెహమాన్, కౌన్సిలర్లు ఆసీఫ్ అలీఖాన్, అల్తాఫ్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, పల్లా రమేష్, జయన్న నాయక్, వైఎస్‌ఆర్ సిపి నాయకులు హబీబుల్లా ఖాన్, అన్నా సలీం, చెన్నూరి అన్వర్ బాష, గౌస్ ఖాన్, సుగవాసి శ్యాంకుమార్, సూరం వెంకటసుబ్బారెడ్డి, జాకీర్ హుస్సేన్, జాఫర్ అలీఖాన్, రియాజ్, సంఘ సేవకులు డాక్టర్ మైనుద్దీన్, కొత్తపల్లె ఇంతియాజ్, శ్రీ సాయి ఇంజినీరింగ్ కాలేజ్ డైరెక్టరు సుధాకర్ రెడ్డి, యువ నాయకులు బేపారీ జబీవుల్లా ఖాన్, బేపారీ అసద్ ఖాన్, గుమ్మా అమర్నాథ్ రెడ్డి, జావీద్, తదితరులు పాల్గొన్నారు. రామాపురం : జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్థానిక వైసిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించారు రాయచోటి శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి స్వగ్రామమైన ఎర్రంరెడ్డి గారిపల్లెలో గడికోట మోహన్ రెడ్డి చేత కేకును కట్ చేయించారు. నీలకంఠరావుపేట గ్రామంలో సర్పంచ్ అయూబ్ అలీ ఖాన్ మాజీ సర్పంచ్ అన్నమయ్య జిల్లా రాయచోటి వైయస్సార్సీపి ప్రచార కార్యదర్శి జాకీర్ హుస్సేన్, కుమ్మరపల్లి గ్రామ సర్పంచ్ ముక్కోటి భారతి పాల్గొన్నారు. మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ ముక్కోటి బసిరెడ్డి, రామాపురంలోని మూడు రోడ్ల కూడలిలోని వైయస్సార్ విగ్రహం వద్ద రాజశేఖర్ రెడ్డి పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ విశ్వనాథరెడ్డి,హొజడ్‌పిటిసి రమణ, స్థానిక సర్పంచ్ నాగభూషణ్ రెడ్డి, యువ నేత చందు, రాష్ట్ర యువజన విభాగ జనరల్ సెక్రెటరీ వెంకటసుబ్బారెడ్డి, సత్య, ఈశ్వర్‌రెడ్డి, పెద్దరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, భక్తవత్సలరెడ్డి, ఓబులేసు, మురళీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఖథీప్ జాఫర్ జాకీర్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి మాజీ ఎంపిటిసి రమణ కోటిరెడ్డి రెడ్డి బాబు రెడ్డి రవీంద్రారెడ్డి రెడ్డయ్య రామ్మోహన్ రెడ్డి జాకీర్ సహదేవరెడ్డి ఖతీఫ్ రషీద్ అయూబ్ ఇంతియాజ్ శీను అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు. ప్రేమాలయంలో హొమండలంలోని బండపల్లి ప్రేమాలయం అనాథాశ్రమంలో బుధవారం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆధ్వర్యంలో జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, కార్యక్రమంలో రాయచోటి మాజీ మండల ఎంపిపి వైసీపీ నాయకులు పోలు సుబ్బారెడ్డి, బిసి నాయకులు పల్లపు రమేష్, మండల అధ్యక్షులు పల్లపు రాజమ్మ, మరియు కౌన్సిలర్ కసిరెడ్డి వెంకట నరసింహ రెడ్డి, ఘనంగా నిర్వహించారు.హొ తరువాత అన్నదానం చేశారు. వీరబల్లి: సిఎం పుట్టిన రోజు సందర్భంగా బుధవారం సేవా క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాల, సానిపాయి పంచాయతీ లగిశెట్టివారిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో ఎంపిపి రాజేంద్రనాథ్ రెడ్డి, వీరనాగిరెడ్డి, సర్పంచ్ నేతి ఆంజనేయులు, మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో గాలివీటి వీరనాగిరెడ్డి, ఎంఇఒ గిరివరదయ్య, రేంజర్ పీరయ్య, మాజీ ఎంపిటిసి చమర్తి సుబ్బరామరాజు, మాజీ ఎంపీపీ నాగభూషణం, శ్రీరాముల రెడ్డి, సుబ్బరామరాజు, ప్రధానోపాధ్యాయులు వేణుగో పాలరావు, కస్తూరిబాయ స్కూల్, లెగిసెట్టివారి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.