Apr 02,2023 23:54

పాడేరులో ర్యాలీ చేపడుతున్న క్రైస్తవులు

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని క్రైస్తవ మందిరాలలో మట్టల ఆదివారం (పామ్‌ సండే) వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తిశ్రద్ధలతో మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు యెరుషలేములోనికి ప్రవేశించిన రోజున కొందరు మట్టలు పట్టుకుని ఆయనను స్తుతించిన గుర్తు చేసుకుంటూ మట్టల ఆదివారం కార్యక్రమాన్ని క్రైస్తవులు జరుపుకుంటారు. పాడేరు పట్టణంలోని ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్ధన మందిరం పాస్టర్‌ జి.తిమోతి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభువైన ఏసుక్రీస్తు ప్రార్థన మందిరం విశ్వాసులు, తదితరులు పాల్గొన్నారు.
సీలేరు: సీలేరులో మట్టల ఆదివారం వేడుకలను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మట్ల ఆదివారం పండగ సందర్భంగా చిన్నారులు వివిధ వేషధా రణలో దర్శనమిచ్చి పలువురు ఆకట్టుకున్నారు. పండుగ ఆవశ్యకతను యుసిఐఎం పాస్టర్‌ మనసై వివరించారు. వీధుల్లో ప్రదర్శనలను నిర్వహించి, జయహో నినాదాలు చేస్తూ, క్రీస్తు గురించి ప్రార్థనలు చేశారు.