Dec 23,2022 00:00

గెలుపొందిన కబడ్డీ జట్టు

ప్రజాశక్తి- కొత్తకోట:రావికమతం మండలం గుడ్డిప గ్రామంలో గురువారం గ్రామ దేవత మరిడిమాంబ పండగను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను మూడేళ్లు కు ఒకసారి నిర్వహిస్తారు. ఈ సందర్బంగా జిల్లా స్థాయి బాలికల కబడ్డీ పోటీ లతో పాటు ఎడ్ల బండి పోటీలు నిర్వహించారు. కబడ్డీ పోటీలలో ఆరు జట్లు, ఎడ్ల బండ్లు పోటీలలో 11 జట్లు పాల్గొన్నాయి కబడ్డీ పొటిలలో జేఎం నాయుడు జట్టు ప్రధమ స్థానం లో నిలువగా వైజాగ్‌ వారియర్స్‌ రెండవ స్థానం లో నిలిచింది. ఎడ్ల బండ్లు పోటీలలో నర్సయ్యపేట ప్రధమ స్థానం, చుక్కపల్లి, నర్సాపురం బండ్లు రెండవ, మూడవ స్థానంలో నిలిచాయి. వీరికి రావికమతం ఎంపిపి పైల రాజు, గ్రామ సర్పంచ్‌ గణేశ్వర రావు తదితరులు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.