ప్రజాశక్తి - ఆదోని
ఆదోని ఎమ్మెల్యే తనయుడు, వైసిపి ఇన్‌ఛార్జీ వై.జయమనోజ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు మున్సిపల్ ఛైర్మన్ బోయ శాంత, వైసిపి పట్టణ అధ్యక్షులు దేవా ఆధ్వర్యంలో పట్టణంలోని అభయాంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే సతీమణి శైలజమ్మ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. వారు మాట్లాడుతూ... జయ మనోజ్ రెడ్డి ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. రాజకీయంగా ఎదిగి ఉన్నత పదవులు అలంకరించి ప్రజా సేవకే అంకితం కావాలని ఆకాంక్షించారు. శ్రీలక్ష్మి, నారి తాయన్న, భవాని, లక్ష్మీనారాయణ, నల్లా రెడ్డి, అయ్యప్ప, కుప్పయ్య, సింహం నాగేంద్ర, బాష బాయి, రామదాస్, ఫయాజ్, రమేష్ చంద్ర, మహిళా నాయకులు జిలేఖ, శ్రీలక్ష్మి, శ్రీదేవి, సుగుణమ్మ, కల్పవళ్లి, ఆంధ్ర లక్ష్మన్న, రాము, హరి, రామకృష్ణ పాల్గొన్నారు.
సంబరాలు చేసుకుంటున్న నాయకులు










