అమలాపురంలో పేదలకు అన్నదానం
ప్రజాశక్తి - అమలాపురం, ఉప్పలగుప్తం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పుట్టిన రోజును కువైట్ ఎన్‌ఆర్‌ఐ, దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం గడియార స్తంభం సెంటర్లో ఘనంగా నిర్వహించారు. కువైట్ ఎన్‌ఆర్‌ఐ గ్రూప్ అధ్యక్షులు మోకా సువర్ణరాజు ఆధ్వర్యంలో కువైట్‌లో మంత్రి విశ్వరూప్ పుట్టినరోజును నిర్వహించారు. సువర్ణ రాజు కువైట్‌లో కేక్ కట్ చేసి పంచారు. అమలాపురం గడియారం సెంటర్లో దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు సంఘం గౌరవాధ్యక్షులు ఒంటెద్దు వెంకయ్యనాయుడు, అధ్యక్షులు నాగారపు పరుశురాముడు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. మంత్రి విశ్వరూప్‌తో కేకును కట్ చేయించారు. పూలమాలలు, బొకేలతో మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం గడియార స్తంభం సెంటర్లో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి సభ్యులు పందిరి శ్రీహరి, గెడ్డం సంపదరావు, అమలాపురం మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ నాయుడు, నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస్, సంసాని బుల్లి నాని, గుమ్మళ్ల సురేష్, ఉండు బాబ్జి, నక్కా సంపత్, వైసిపి కౌన్సిలర్లు, దివ్యాంగుల సంక్షేమ సంఘం సెక్రటరీ సత్యదుర్గ, పరమట శ్రీకాంత్, అయితాబత్తుల సురేష్ కుమార్, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఉప్పలగుప్తం మండలంలో పలు గ్రామాల్లో మంత్రి విశ్వరూప్ పుట్టినరోజునకు నిర్వహించారు.ఉప్పలగుప్తంలో జరిగిన వేడుకల్లో మంత్రి తనయుడు డాక్టర్ పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు. వృద్ధ మహిళలకు డాక్టర్ శ్రీకాంత్, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చీకట్ల కిషోర్, సర్పంచ్‌ల సమాఖ్య మండల అధ్యక్షుడు కడిమి చిన్నవరాజు ఆధ్వయ్రంలో చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు అడబాల మాధవ, మునిపల్లి సర్పంచ్ యర్రంశెట్టి రామచంద్రరావు, ఎంపిటిసి సభ్యులు కొంకి ఏడుకొండలు, ఉప సర్పంచ్ మోకా శ్రీను, వైసిపి రైతు విభాగం మండల అధ్యక్షుడు చిక్కం బాలయ్య, యువజన విభాగం మండల అధ్యక్షుడు విజయకుమార్, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










