Jul 09,2023 20:17

కేక్‌ కట్‌ చేస్తున్న మంత్రి బొత్స, ఆయన సతీమణి ఝాన్సీలక్ష్మి
మంత్రి బొత్సకు శుభాకాంక్షలు తెలుపుతున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర
మంత్రి బొత్సకు శుభాకాంక్షలు తెలుపుతున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

ప్రజాశక్తి-విజయనగరం :  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఆదివారం ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. మంత్రి బొత్సకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర, మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఆయన నివాసంలో కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, బడుకొండ అప్పలనాయుడు, కంబాల జోగులు, మన్యం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్‌, రఘురాజు, పెనుమత్స సురేష్‌బాబు, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, నగరంలోని పలువురు కార్పొరేటర్లు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం డిఆర్‌ఒ గణపతిరావు, పార్వతీపురం డిఆర్‌ఒ వెంకటరావు, ఆర్‌డిఒ సూర్యకళ తదితర అధికారులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి మంత్రి బొత్సతో కేక్‌ కట్‌ చేయించారు. మంత్రి సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి, కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సత్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జన్మదిన వేడుకలు ధీర ఫౌండేషన్‌, సత్యా విద్యాసంస్థలైన సీతం ఇంజినీరింగ్‌ కళాశాల, సత్యా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని కనకమహాలక్ష్మి దేవాలయం వద్ద , ప్రేమ సమాజం వృద్ధాశ్రమం వద్ద, పైడితల్లి అమ్మవారు దేవాలయం వద్ద, సీతం కళాశాల వద్ద , వికలాంగులకు చక్రాల కుర్చీలు, కృత్రిమ అవయవాలు, వినికిడి పరికరాలు, చీరలు, బెడ్‌షీట్లు, పండ్లు, బ్రెడ్‌, భోజనం, పండ్ల రసాలు, వాటర్‌ బాటిళ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. సీతం కళాశాలలో విద్యార్థులందరూ 50 కిలోల భారీ కేక్‌ను కట్‌ చేసారు. కార్యక్రమాలలో సత్య విద్యాసంస్థల సంచాలకులు డాక్టర్‌ మజ్జి శశిభూషణరావు, ఎన్‌సిసి ఆఫీసర్‌ కెప్టెన్‌ సత్యవేణి, సిఎస్‌ఒ సత్యనారాయణ, ఫిజికల్‌ డైరెక్టర్‌ మహేశ్వరరావు, మేనేజర్‌ లెంక రాము, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు .