Apr 26,2023 00:15

ర్యాలీలో పాల్గొన్న డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ హేమంత్‌

ప్రజాశక్తి-యంత్రాంగం
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జిల్లాలో పలుచోట్ల మంగళవారం ఘనంగా నిర్వహించారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి మలేరియా నివారణపై అవగాహన కల్పించారు.
ములగాడ : జీవీఎంసీ 40వ వార్డు ఎకెసి కాలనీలో జీవీఎంసీ బయాలజిస్ట్‌ చక్రవర్తి పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించారు. వార్డు కార్పొరేటర్‌ గుండపు నాగేశ్వరరావు జోన్‌ - 5 కమిషనర్‌ ఆర్‌జివి.కృష్ణ మలేరియా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏప్రిల్‌ 25న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మలేరియా సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేరియా ఇన్‌స్పెక్టర్‌ డి.రవికుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయం సెక్రటరీలు, మలేరియా సూపర్‌ వైజర్లు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, సచివాలయ వాలంటీర్లు పాల్గొన్నారు.
కంచరపాలెం : కంచరపాలెంలోని ప్రభుత్వ బాలికల ఐటిఐలో మలేరియా నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ విశాఖ శాఖ ట్రెజరర్‌ డాక్టర్‌ ఎంవివి.మురళీమోహన్‌ మలేరియా వ్యాప్తి, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. దోమతెరను వాడాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ ప్రిన్సిపల్‌ గౌరీమణి, లెక్చరర్‌, సబ్‌ యూనిట్‌ అధికారి మాధవీలత, సిబ్బంది, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
భీమునిపట్నం : మండలంలోని తాళ్లవలస పిహెచ్‌సి ఆధ్వర్యాన మంగళవారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిహెచ్‌సి వద్ద ప్రారంభమైన ర్యాలీ మెయిన్‌ రోడ్డు మీదుగా గంట స్తంభం వరకు చేరింది. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ శోభారాణి, ఆరోగ్య విస్తరణాధికారి జి.రాజ్‌కుమార్‌, వెలుగు ఎపిఎం బి.రంగారావు, స్త్రీనిధి మేనేజర్‌ సుశీల గ్రేసీ, హెల్త్‌ అసిస్టెంట్లు, సిసిలు, విఒ, ఒబిఎస్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు వెలుగు కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఆనందపురం : మండలంలోని కుసులవాడ పంచాయతీ ఇచ్చాపురంలో ఆనందపురం పిహెచ్‌సి ఆధ్వర్యాన మలేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి పి.సాంబమూర్తి, సిహెచ్‌ఒపి స్వర్ణలత, ఆరోగ్య కార్యకర్తలు మెట్ట దేవి, ఆర్‌.నాగేశ్వరరావు, ఆశా కార్యకర్త దేవుడమ్మ, అంగన్వాడీ కార్యకర్త పాల్గొన్నారు.
మాడుగుల : మలేరియా పట్ల ప్రజలు అప్రమత్తత పాటించి, జాగ్రత్తలు వహించాలని కే.జే పురం పిహెచ్‌సి వైద్యాధికారులు ప్రసాద్‌ పాత్రుడు, లీలా ప్రసాద్‌ తెలిపారు. జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా మంగళవారం మాడుగుల, కే జే పురం గ్రామాలలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనాఫిలస్‌ అడ దోమ కారణంగా మలేరియా వ్యాపిస్తుం దని, పరిసరాలు పరిశుభ్రంగా వుంచడం ద్వారా దీని బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. ఆరోగ్య విస్తరణ అధికారి రవికుమార్‌, సిహెచ్‌ఓ కామేశ్వరి, సిబ్బంది వెంకటరావు, ఏ ఎన్‌ ఎం లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కోటవురట్ల : మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది మలేరియా దినోత్సవం నిర్వహించారు. పిహెచ్‌సి వైద్యులు సంతోష్‌ కుమార్‌,
గొలుగొండ : కేడీపేట పిహెచ్‌సిలో జాతీయ మలేరియా దినోత్సవాన్ని వైద్యాధికారులు, సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, వైద్యాధికారులు పిహెచ్‌సి నుండి గ్రామంలో మెయిన్‌ రోడ్డులో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు గాయిత్రి, హరి ప్రవీణ్‌ మాట్లాడుతూ, మలేరియా నిర్మూలనకు ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కశింకోట : కశింకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ తిరుపతిరావు ఆధ్వర్యంలో మంగళవారం మలేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు మంచినీరు నిల్వ ఉన్నచోట గుడ్లుపెట్టి అభివృద్ధి చెందుతాయని, అందువల్ల వారికి ఒక రోజు డ్రైడే పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మురళీ కృష్ణ, సత్యవతి, సత్యనారాయణ, మున్నా, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : మలేరియా ఫైలేరియా తదితర దీర్ఘకాలిక వ్యాధులను వ్యాపింపజేసే దోమల పట్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ రజని అన్నారు. మండలంలోని ఉప్పవరం గ్రామంలో మంగళవారం ర్యాలీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఫణింద్ర, చిన్ని రమణ, వైసీపీ నాయకుడు భీముని నాగేశ్వరరావు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
మునగపాక రూరల్‌ : ప్రతి ఒక్కరూ పరిసరాల పరి శుభ్రత పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని పీహెచ్సీ వైద్యులు డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ సూచించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మంగళవారం మలేరియా వ్యాధిని అరికట్టాలని ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిహెచ్‌ఓ దేవకాంత, స్టాప్‌ నర్స్‌ సలీమా, ల్యాబ్‌ టెక్నీషియన్‌ శిరీష, హెల్త్‌ అసిస్టెంట్‌ జ్యోతి లాల్‌, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
దోమల నిర్మూలన అందరి బాధ్యత
మలేరియా దినోత్సవంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ హేమంత్‌
అనకాపల్లి : దోమల నిర్మూలన మన అందరి బాధ్యత అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ హేమంత్‌ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ నెహ్రూ చౌక్‌, మెయిన్‌ రోడ్డు, బాలాజీ రావు పేట మీదుగా తిరిగి ఎన్టీఆర్‌ ఆసుపత్రి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా వ్యాప్తికి దోమలు ప్రధాన కారణమని, దోమల వ్యాప్తికి మురికి గుంటలు, ఇళ్లల్లో నీరు నిల్వ ప్రధాన కారణమని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, మందులు చల్లడం, ఫ్యాగింగ్‌ నిర్వహించడం, వారానికి ఒకరోజు డ్రైడేగా పాటించడం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డిఎం అండ్‌ హెచ్‌ఓ శారద బాయి, జిల్లా మలేరియా అధికారి ఉమామహేశ్వరరావు, మలేరియా శాఖ, జీవీఎంసీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశాలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.