కడప అర్బన్ : భారతదేశం మతసామరస్యానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త సల్లేవుల్లాహు వసల్లం అడుగుజాడల్లో నడవాలని ఉప ముఖ్య మంత్రి ఎస్. బి. అంజాద్ బాషా అన్నారు. గురువారం మహమ్మద్ ప్రవక్త సల్లే వుల్లాహు వసల్లం జయంతిని మిలాదున్‌నబీ వేడుకలు ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, రైతులు సుఖ శాంతులతో సుభిక్షంగా ఉండాలని చెప్పారు. తొలుత ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ మత పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. పోరుమామిళ్ల టౌన్ : మిలాదున్ నబీ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోద రులు మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్బంగా ప్రార్థన నిర్వహించారు. అనంతరం పోరుమామిళ్లలోని మహబూబ్ నగర్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కబా నమూనాను వాహనం మీద ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. ఈ ర్యాలీలో ఇస్లాం మత పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










