Mar 08,2023 23:49

హుకుంపేటలో మాట్లాడుతున్న ఉప సర్పంచ్‌ కాసులమ్మ

ప్రజాశక్తి-డుంబ్రిగూడ: స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఎస్సై సంతోష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును కట్‌ చేసి మహిళా పోలీసులకు అందజేశారు. మహిళా పోలీసులను సన్మానించారు. ప్రస్తుత సమాజంలో మహిళల పాత్ర కీలకమైందని,అన్ని రంగాల్లో రాణించాలని ఎస్సై ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు:మండల కేంద్రంలోని కళ్యాణ మండపం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను గిరిజన మహిళ సంఘం (ఐద్వా) మండల అధ్యక్షురాలు సీసా విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అల్లూరి జిల్లా కార్యదర్శి వి.విజయ మాట్లాడుతూ, మహిళల హక్కులు, చట్టాల అమలుకు చైతన్య పరచాలని సంఘం సభ్యులను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా చట్టాలను, హక్కులను కాలరాస్తున్నాయన్నారు. గిరిజన మహిళలకు రక్షణ కల్పించి, మాతా శిశు సంక్షేమ పథకాలు అమలు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళ సంఘం కమిటీ సభ్యురాలు సోనియా ఈశ్వరి, మండల వైస్‌ ఎంపీపీ పాటుబోయి సత్యనారాయణ, గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎంఎం శ్రీను, సిపిఎం మండల కార్యదర్శి పాంగి భీమరాజు, మండల విద్యుత్‌ కార్మికుల సంఘం కమిటీ సభ్యుడు కిముడు సత్తిబాబు, గిరిజన మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హుకుంపేట: మహిళలు అన్ని రంగాల్లో రాణించాని వైస్‌ సర్పంచ్‌ కాసులమ్మ కోరారు. చినబురుగుపుట్టు గ్రామంలో మహిళా దినోత్సవం పురస్కరించుకుని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం వైస్‌ సర్పంచ్‌ కాసులమ్మ మాట్లాడుతూ,మహిళలు బాగా చదివి మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.మహిళలు సమస్యలు వచ్చినప్పుడు కుంగి పోకూడదని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్‌ కుడెలి పుష్పవతి, జ్యోతి, బండకత్తి కృష్ణవేణి, గల్లుంగి చిలకమ్మ, చీడిపల్లి కొందమ్మ, ఈశ్వరమ్మ, భవాని, సుమిత్ర, నూకలమ్మ, భాగ్య, చెల్లెమ్మ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు సత్కారం
పెదబయలు రూరల్‌:మండలంలో సీతగుంట పంచాయతీ ఇందిరా కాలనిలో ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు చెండా లోహితసు ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. వృద్ధ మహిళను సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్‌లో మహిళలంతా పోరాటాలకు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి మహిళలు పాల్గొన్నారు.
హుకుంపేట:పెదగరువు, గూడ బాలికల ఆశ్రమ పాఠశాలలో పారా స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ప్రధాన ఉపాధ్యాయులు ఎం.కొండమ్మ అద్యక్షతన నిర్వహించారు. గోడపత్రికలను హెచ్‌ఆర్‌ క్లబ్‌ లీడర్లతో విడుదల చేశారు. అనంతరం సంస్థ జిల్లా సమన్వయ కర్త టి.క్రిష్ణ రావు మాట్లాడుతూ, నిరంతర శ్రమజీవి స్త్రీ మూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
చింతూరు : మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్‌ఎంఎస్‌ హాస్టల్‌లో మహిళ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యాన మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా మండల కార్యదర్శి తులసీ, కవిత, ఏటిడబ్ల్యూఓ కె.సుజాత, సిడిపిఓ, ఉపాధ్యాయులు అశ్విని తదితరులు పాల్గొన్నారు.
సీలేరు : జీకే వీధి మండలం సీలేరు డిఏవి పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎస్‌ఈ సివిల్‌ కెకెవి.ప్రశాంత్‌ కుమార్‌, అకౌంట్‌ ఆఫీసర్‌ వెంకటరెడ్డి, ఏడిఈ (క్యాంపు) అప్పలనాయుడు పాల్గొని మాట్లాడారు. మహిళలు తమ సొంత బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబ శ్రేయస్సు కొరకు పాటుపడుతున్నారని తెలిపారు. అలాగే ఏపీ జెన్కో కాలనీలో మహిళా దినోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచంద్రరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
కొయ్యూరు : స్థానిక సిఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్‌లో మహిళా పోలీసుల కలిసి మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు శుభకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు, మంప ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రాజవొమ్మంగి : మహిళలు అన్ని రంగాలలో పురుషులకు సమానంగా రాణిస్తున్నారని ఎంపిపి గోము వెంకటలక్ష్మి అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కొనకం వరలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల మహిళా సమైక్య సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం ఆదినారాయణ, ఏపీవో సురేష్‌ కుమార్‌, ఎంపీటీసీ కనిగిరి గంగదుర్గ, మండల మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు.