Oct 02,2023 23:12

ప్రజాశక్తి-యంత్రాంగం మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలు జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకినాడ మత సామరస్యమే మహాత్మా గాంధీకి నిజమైన నివాళి అని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు అన్నారు. సుందరయ్య భవన్‌లో గాంధీజీకి వారు ఘనంగా నివాళులర్పించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల ఈశ్వరి పాల్గొన్నారు. ఎపి ఎన్‌జిఒ హోమ్‌లో వేపకాయల వెంకటకృష్ణ, మట్టపర్తి వెంకటేశ్వరరావు, పాలపర్తి మూర్తిబాబు, ఎస్‌.చంద్రబాబు, షేక్‌ అజీజ్‌, సత్తిరాజు, సుజాత పాల్గొన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో గాంధీ విగ్రహానికి జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధర్‌ రెడ్డి వివిధ విభాగాధిపతులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టరేట్‌ ఎఒ జిఎస్‌ఎస్‌.శ్రీనివాసు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బిఇవిఎల్‌ నాయుడు, సత్యనారాయణ, మూర్తి, టి.తేజేశ్వరరావు, దివాకర్‌ రావు నివాళి అర్పించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సిఇఒ అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఆర్‌డిఒ కార్యాలయంలో ఆర్‌డిఒ ఎన్‌వివి.సత్యనారాయణ నివాళులర్పించారు. కాకినాడలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పున్నంరాజు ఉమా మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు. పి.చిరంజీవినీ కుమారి, ముడుంబ వెంకటరాఘవానంద్‌, యునియన్‌ బ్యాంకు అధికారి సాయిమనోహర్‌, డివి.రంగారావు పాల్గొన్నారు.కాకినాడ రూరల్‌ తిమ్మాపురం పంచాయతీ సచివాలయంలో సర్పంచ్‌ బెజవాడ సత్యనారాయణ పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగి వారిని ఘనంగా సత్కరించి, మిఠాయిలు పంచారు. ఎంపిటిసి ముద్దన వెంకటరాజు, కార్యదర్శి ప్రియాంక, నికిత, గణేష్‌, ఈశ్వరి, పోలిశెట్టి రమణి వీరబాబు, గంగుమళ్ల సాంబశివ, వీర్ల శ్రీను, పి.సత్యనారాయణమూర్తి, జియ్యన్న, దొరబాబు, రత్నం పాల్గొన్నారు. ఏలేశ్వరం ప్రత్తిపాడు ఎంఎల్‌ఎ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ ఏలేశ్వరంలో గాంధీ విగ్రహానికి పూలమాలు నివాళులు అర్పించారు. చైర్‌పర్సన్‌ అలమండ సత్యవతి, వైసిపి నాయకులు ఆలమండ చలమయ్య, శిడగం వెంకటేశ్వరరావు, తొండారపు రాంబాబు, వాగు బలరాం, దిల్బర్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు. తాళ్లరేవు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి రాయుడు సునీత గంగాధర్‌, జెడ్‌పిటిసి దొమ్మేటి సామ్యూల్‌ సాగర్‌, ఎఎంసి చైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ, వైస్‌ ఎంపిపి ధూళిపూడి నాగేంద్రప్రసాద్‌, ఎంపిడిఒ ఎం.అనుపమ నివాళులర్పించారు. గాంధీ బొమ్మ సెంటర్‌లో ఉంగరాల వెంకటేశ్వరరావు, చిట్టూరి చలపతి, భూసారపు పద్మారావు, రేకాడి వెంకటేశ్వర్లు, గుత్తుల శ్రీను నివాళి అర్పించారు. పెద్దాపురం ఆర్‌డిఒ సీతారామారావు, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరు దొరబాబు, కమిషనర్‌ జె.సురేంద్ర, చైర్‌పర్సన్‌ బొడ్డు తులసి మంగతాయారు, వైస్‌ చైర్మన్లు నెక్కంటి సాయి ప్రసాద్‌, కనకాల మహాలక్ష్మి, జనసేన ఇన్‌ఛార్జి తుమ్మల బాబు, మరిడమ్మ ఆలయం ఎసి సిహెచ్‌.రామమోహనరావు, రాకుర్తి రాంబాబు నివాళులర్పించారు. కోర్టు కాంప్లెక్స్‌లో 7వ అదనపు జిల్లా జడ్జి జి.చంద్రమౌళీశ్వరి, జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.బుల్లెమ్మ నివాళులర్పించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వేదుల సుబ్రహ్మణ్యం, ఎపిపి నాగరాజు, పిపి జయరావు పాల్గొన్నారు. నవోదయ విద్యాలయలో ప్రిన్సిపల్‌ కె.రామిరెడ్డి నివాళ లర్పించారు. అన్నవరం రత్నగిరి కొండపై హైకోర్టు జడ్జి జస్టిస్‌ గోపాలకృష్ణ, దేవస్థానం ఇఒ ఎస్‌.ఆజాద్‌ నివాళి అర్పించారు. ప్రత్తిపాడు కోర్టు న్యాయవాదులు కోర్టు పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి కాటం భాను, ప్రత్తిపాడు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చిట్టంశెట్టి పుల్లయ్య, కార్యదర్శి బి.మధుబాబు, చలంకూరి రామకృష్ణ, ఆర్‌.వెంకట్రావు, కామేష్‌, పలివెల నాగేంద్ర, అశోక్‌, మంజూష, ప్రసన్న పాల్గొన్నారు. సామర్లకోట చైర్‌పర్సన్‌ గంగిరెడ్డి అరుణ, కమిషనర్‌ జయ రామారావు, తహశీల్దారు ఎస్‌.లక్ష్మీనరసికుమారి, డిటి కె.శ్రీనివాసరావు, ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, ఎంపిడిఒ డి.శ్రీలలిత, జనసేన నేత తుమ్మల రామస్వామి, రైల్వే స్టేషన్‌లో మేనేజర్‌ ఎస్‌.రమేష్‌, పోలీస్‌ స్టేషన్లో సిఐ కె.దుర్గాప్రసాద్‌ నివాళులర్పించారు. మాధవపట్నం జమునా నగర్‌ కాలనీలో టి.లోవరాజు, జి.కృపానందం, అంగర గోపాలకృష్ణ నివాళులర్పించారు. కరప జెడ్‌పిటిసి వై.సుబ్బారావు, ఎంపిపి పెంకే శ్రీలక్ష్మి సత్తిబాబు, ఎంపిడిఒ కె.అప్పారావు, భీమ్‌ శంకర్‌, తహశీల్దారు పొన్నమండ శ్రీనివాసరావు, కరప సర్పంచ్‌ సాదే ఆశాజ్యోతి కుమార్‌, కార్యదర్శి నాగేంద్ర కుమార్‌, ఎస్‌ఐ రామకృష్ణ, బుల్లి కృష్ణవేణి నివాళులర్పించారు. పిఠాపురం ఉప్పాడ బస్‌ స్టాండ్‌ సెంటర్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కుంచే చిన్న, కోనేటి రాజు, కె.నాగేశ్వరరావు, కె.విశ్వనాథం, కె.మణి, డి.సత్యనారాయణ, డి.గోపాలకృష్ణ, సత్తిబాబు, జి.అప్పారావు, ఎస్‌.శ్రీను, జిఎస్‌.భాస్కర్‌, పి.చంటి, సత్యనారాయణ, యేసు, మోహనాచార్యులు పాల్గొన్నారు. గండేపల్లి ఎంపిపి చలగళ్ల దొరబాబు, జెడ్‌పిటిసి పరిమి వెంకటలక్ష్మి మంగతాయారు, ఎంపిడిఒ రామన్‌, మురారిలో సర్పంచ్‌ ఆనంద్‌, ఉపసర్పంచ్‌ జాస్తి వసంత్‌ నివాళులర్పించారు. మల్లేపల్లిలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గ్రంధి నాగ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.