Aug 22,2023 23:35

నరసరావుపేటలోని అనన్య ఆస్పత్రిలో వేడుకలు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పల్నాడు రోడ్‌లో ఉన్న అనన్య హాస్పటల్స్‌ అధినేత, సింగరాజు ఫౌండేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సింగరాజు సాయికృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. భారీకేక్‌ను కట్‌ చేశారు. అనంతరం ఆస్పత్రిలో వికలాంగులు, వృద్ధులకు ఉచిత వైద్యశిబిరం నిర్వహించగా విశేష ఆదరణ లభించింది. 200 మందికి పైగా వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సింగరాజు ఫౌండేషన్‌ ద్వారా ఏర్పాటు చేసిన రక్తదాన సిబిరంలో 50 మందికిపైగా విద్యార్థులు, చిరంజీవి అభిమానులు రక్తదానం చేయగా వీరికి డాక్టర్‌ సాయికృష్ణ, డాక్టర్‌ విద్య దంపతులు ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సాయికృష్ణ మాట్లాడుతూ భవిష్యత్‌లో అనన్య హాస్పిటల్‌, సింగరాజు ఫౌండేషన్‌ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో డిబిహెచ్‌పిఎస్‌ అధ్యక్షులు డాక్టర్‌ జి.రమేష్‌ కుమార్‌, నవ భారత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కె.కృష్ణమూర్తి, టిడిపి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధ్యక్షులు పి.సునీల్‌, నవ భారత దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు వై.కృష్ణ, గంగయ్య, బి.శ్రీనివాసరెడ్డి, ఎ.జిలాని, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - అచ్చంపేట : మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అచ్చంపేటలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షులు టి.ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గంధం కోటేశ్వరావు పాల్గొని కేక్‌ కట్‌ చేసి మాట్లాడారు. చిరంజీవి క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగారని అభిమానులను సంపాదించుకున్నారన్నారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో, వ్యక్తిగతంగా పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో డి.అనంతరామయ్య, కె.వీరాంజనేయులు, ఎన్‌.ప్రసాదు, టి.కోటి, జి.మురళి, జి.సాంబశివరావు, కె.రమేష్‌, వై.శీను, ఎన్‌.వెంకటేశ్వరరావు, పి.నరసింహస్వామి, జి.పాండా, కె.ఆంజనేయులు, ఎం.జనార్ధన్‌రావు, స్వామి పాల్గొన్నారు.