
ప్రజాశక్తి- విలేకర్ల బృందం
అనకాపల్లి : మేడే సందర్భంగా స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయం వద్ద సీనియర్ నాయకులు ఎ.బాలకృష్ణ పతాక ఆవిష్కరణ చేశారు. ఏపీ బేవరేజెస్, బైపాస్, బాటా సెంటర్, మున్సిపల్ కార్యాలయం, మూడవ జోన్, ఆర్‌ఎఆర్‌ఎస్, ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం, బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయ, జీవీఎంసీ ట్రీట్మెంట్ ప్లాంట్, ఆర్టీసీకాంప్లెక్స్, ఆటో తదితర ప్రాంతాల్లో సిఐటియు జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు రుత్తల శంకరరావు మాట్లాడుతూ భారతదేశంలో మేడే పతాకావిష్కరణ ప్రారంభించి నేటికి 100 సంవత్సరాలు పూర్తి అయిందన్నారు. వివిధ సంఘాల నాయకులు గంటా శ్రీరామ్, కె.కొండారావు, మందా రాము, రాజు, భీశెట్టి అప్పారావు, బొమ్మాల రాము, వద్ద బి.వాసు, కొణతాల నందేశ్వరరావు, పిఎన్‌వి పరమేశ్వరరావు, వత్సవాయి శ్రీలక్ష్మి, బొప్పే ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. సిపిఐ కార్యాలయంతో పాటు పట్టణంలో పలుచోట్ల సిపిఐ నాయకులు జెండా ఆవిష్కరణలు చేశారు. బాలేపల్లి వెంకటరమణ, వైఎన్ భద్రం, కోన లక్ష్మణ, పాల్గొన్నారు. మార్టూరు, బవులవాడ, మామిడిపాలెం గ్రామాల్లో ఎఐఎఫ్‌టియు నాయకులు కోన మోహన్‌రావు, ఎన్ భాస్కర్‌రావు, జెండా ఆవిష్కరణలు చేశారు.
అచ్యుతాపురం : అచ్యుతాపురం మండల కేంద్రంతో పాటు అభిజిత్, మైతాన్, ఏషియన్ పెయింట్, లారస్, దొరైపాలెం ఫార్మా పరిశ్రమల, రుషిల్ డెకార్, పరిశ్రమల వద్ద, తిమ్మరాజుపేట, హరిపాలెం, కొండకర్ల, దిబ్బపాలెం, దోసూరుతో పాటు 25 ప్రదేశాల్లో సిఐటియు ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ బ్రిటీష్ పాలనలో 12 గంటలు పని గంటలను కార్మికులు ఐక్యత పోరాడి ఎనిమిది గంటలకు తగ్గించుకున్నారని, సిఐటియు నాయకులు ఆర్.రాము, కె.సోమినాయుడు, రాజాన సత్తిబాబు, రామ్ కుమార్, చిన్న, రాజు పాల్గొన్నారు.
మునగపాక రూరల్ : మునగపాక ఎస్‌బిఐ, తోటాడ జంక్షన్, గవర్ల అనకాపల్లి సుందరయ్య విజ్ఞానం కేంద్రం, రాజుపేట ఇండియా ఫుడ్స్ జీడిపిక్కల కంపెనీ తదితర ప్రాంతాల్లో సిఐటియు జెండాలను నాయకులు ఎస్.బ్రహ్మాజీ, వివి.శ్రీనివాసరావు, ఆళ్ల మహేశ్వరరావు, రామ సూరప్పారావు ఆవిష్కరించారు. ఆడారి రామలక్ష్మి, అరుణ, అంజలి, తులసి, దాడి ఉమా పాల్గొన్నారు.
పరవాడ : మండలంలోని వాడ చీపురుపల్లి, దీపాంజలి నగర్, పవర్ గ్రిడ్, పరవాడ సినిమా హాల్ జంక్షన్, కాటా సంతబయలు, మండల పరిషత్ జంక్షన్, ఫార్మసిటీలోని విజయశ్రీ పరిశ్రమ, బయోకాన్ పరిశ్రమ ప్రాంతాల్లో సిఐటియు జెండాలను ఆవిష్కరించారు. నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, పి.మాణిక్యం, చీపురుపల్లి ప్రసాద్, చిట్టిబాబు, ఎం సింహాచలం, వెంకటేశ్వర నాయక్, ఎం.బాబురావు, కె.రమణ, అనకాపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కె.కోటపాడు : స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి మూడు రోడ్ల కూడలి వరకు సిఐటియు ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. చౌడువాడ, ఆనందపురం గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు చేశారు. నాయకులు డోకల కుమారి, ఎర్ర దేవుడు, జి.కోటేశ్వరరావు, గండి నాయన బాబు, సూర్యనారాయణ పాల్గొన్నారు.
చోడవరం : సిఐటియు ఆధ్వర్యంలో వెంకన్నపాలెం గ్రామంలో ముఠా కార్మికులు ఎర్రజెండాను ఎగురవేశారు. నాయకులు ఎస్వీ నాయుడు, జోగారావు, అప్పలనాయుడు, గోవిందు, సత్తిబాబు పాల్గొన్నారు.
సబ్బవరం : సబ్బవరం ఎన్టీఆర్ జంక్షన్‌లో సిఐటియు జెండాను రాష్ట్ర ఐద్వా అధ్యక్షురాలు బి.ప్రభావతి ఆవిష్కరించారు. దుర్గమాంబ కళాసీల సంఘ కార్యాలయం, బొడువలసలోని ప్లాస్టిక్ కంపెనీ, సబ్బవరం ఆటో స్టాండ్ ప్రాంతాల్లో సిఐటియు జెండాలను ఎగరవేశారు. నాయకులు బర్ల రమణ, పూడి అప్పల నాయుడు, ఉప్పాడ సత్యవతి, ఎం.గౌరీశ్వరరావు, అనురాధ, కె.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
రాంబిల్లి : రాంబిల్లి, కొత్తపట్నం, నేవీగేట్, వై.లోవ వెంకటాపురం, అప్పారాయుడుపాలెం, మామిడివాడు ప్రాంతాల్లో సీఐటీయూ జెండాలను ఆవిష్కరించారు. కోలాటం, ఆటపాటలతో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిఐటియు నాయకులు జ.దేముడు నాయుడు పాల్గొన్నారు.
కశింకోట : కశింకోట మండల కేంద్రంలో సిఐటియు జెండాను ఆవిష్కరించారు. నాయకులు దాకారపు శ్రీనివాసరావు, శంకర్, ఎం.నాగ శేషు, కె.శాంతి భవాని, ఎస్‌కె రెహమాన్, ఏవి అప్పారావు, లోకేష్, ఎం రమణ పాల్గొన్నారు. ఎఐటియుసి జిల్లా నాయకులు దొరబాబు అరుణ పతాకాన్ని ఎగరవేశారు.
వడ్డాది : బుచ్చయ్య పేట మండలం వడ్డాదిలో చెరుకు కాటా వద్ద నుండి సబ్ స్టేషన్ వరకు ర్యాలీ చేసి, అక్కడ జెండా ఎగరవేశారు. స్వీట్స్ పంపిణీ చేశారు. నాయకులు పెనపాత్రుని సాంబశివరావు, ప్రేమ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
దేవరాపల్లి : మండల కేంద్రంలో సిపిఐ నాయకులు వేమల కన్నబాబు జెండా ఆవిష్కరణ చేశారు. ఆ పార్టీ నాయకులు గరికిన రాజు, రూడీ రామారావు, జి మల్లేష్, కే చిరంజీవి పాల్గొన్నారు.
నక్కపల్లి:నక్కపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన ఆటోస్టాండ్, చేపలు మార్కెట్, రాజయ్యపేట ఆటో స్టాండ్ వద్ద ఎర్ర జెండాలు ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాడుతూ, మేడే స్ఫూర్తితో కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి కార్మిక వర్గం సమాయత్తం కావాలన్నారు. యూనియన్ నాయకులు రామకృష్ణ, దేవుళ్ళు, నాగేశ్వరరావు, గిరి, నాగు, అర్జున్, నూకరాజు, కృష్ణ, రాజు, ఆనంద్, రమణ, అప్పారావు పాల్గొన్నారు.
మండలంలోని చీడిక గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో మేడే దినోత్సవం నిర్వహించారు. మండల కార్యదర్శి అజరు, గిరిబాబు, సోమరాజు, నాగేంద్ర, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్ :పట్టణంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.సత్తిబాబు ఆధ్వర్యంలో మే డే దినోత్సవాన్ని నిర్వహించారు. కాఫీ క్యూరింగ్ కార్మికులు, మున్సిపల్, ముఠా, భవన నిర్మాణ కార్మికులు కృష్ణ బజార్ నుండి కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొర్రా శ్రీనివాసరావు, కుప్పరాల రాజు, రొట్టెల గోవిందు, నానాజీ, రామకష్ణ పాల్గొన్నారు.
మే డే పురస్కరించుకొని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం వద్ద ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డిఎల్ రాజు అధ్యక్షతన మే డే వేడుకలు నిర్వహించారు. డిపో సీనియర్ నాయకులు ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ సహాయ కార్యదర్శి వై.రామం జెండాను ఆవిష్కరణ చేసారు. ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎల్వి రమణ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను తుంగలో తొక్కే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు.ఎల్‌ఐసి యూనియన్ నాయకులు పడాల్, డిపో సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొత్తకోట:రావికమతం మండలం కొత్తకోట, జి చీడిపల్లి గ్రామాలలో మే డే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తకోట లో శ్రీ వెంకట సిద్ధి వినాయక ఎలక్ట్రికల్ ప్లంబింగ్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం ఎదురుగా జెండా ఆవిష్కరణ చేశారు.సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.గోవిందరావు మాట్లాడారు .స్థానిక యూనియన్ అధ్యక్షులు డి.సత్తిబాబు, సీనియర్ ఎలక్ట్రిషన్ పి.రమణాజి, యూనియన్ ఉపాధ్యక్షులు డి.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్జున్ రావు, కోశాధికారి ప్రభాకర్, యూనియన్ సభ్యులు పూడి నల్లయ్య, యు.శివ పాల్గొన్నారు.జి.చీడిపల్లి గ్రామంలో ఎఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జి. జోగిరాజు, సభ్యులు పులగండం శ్రీను, సేనాపతి శ్రీను పాల్గొన్నారు.
గొలుగొండ: పాత కేడిపేటలో మే డే ఉత్సవాలు సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సెక్రటరీ వాసుదేవరావు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మేకా సత్యనారాయణ, కొయ్యూరు మండల పార్టీ సెక్రటరీ ఇరువాడ దేవుడు, పాంగి పోలయ్య, సీనియర్ నాయకులు గల్లా సన్యాసిరావు, గల్లా గణేష్, అనిశెట్టి శ్రీను, రేలంగి కిరణ్ కుమార్, నలిని వర్మ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణదేవిపేటలో శ్రీ విశ్వ జ్యోతి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మే డే దినోత్సవం జరిగింది. సంఘ అధ్యక్షులు పల్లా గంగరాజు ఏఐటీయూసీ జెండా ఆవిష్కరించారు.
పాయకరావుపేట:పట్టణంలోని విజయ నవదుర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. గౌతమి థియేటర్ నుండి వై జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ. నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ సంఘం అధ్యక్షులు గెడ్డమూరి బాబ్జి, సంఘ సభ్యులు. బి.ఎన్.ఎస్. చంటి, పండు, దాసరి శ్రీను, సిగిరెడ్డి పాండు పాల్గొన్నారు.
రావికమతం:మండలంలో కవగుంట గ్రామ పంచాయతీలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి సూర్యకుమారి వరహాలు జెండాను ఎగర వేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రగడ నాగేశ్వరరావు, సిద్దా కృష్ణ, తలుపుల నాయుడు, అచ్చం నాయుడు పలువురు సభ్యులు పాల్గొన్నారు.