
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
మదర్‌థెరిస్సా సేవలు చిరస్మరనీయమని లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య అన్నారు. మదర్‌థెరిస్సా జయంతి వేడుకలు డైమండ్స్ లయన్స్, వశిష్ట లియో క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత మదర్‌థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లార్డ్స్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ ఆశ్రమం చిన్నారులకు క్లబ్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య స్నాక్స్, డ్రింక్స్ అందించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరీ సాయం చేసిన విశ్వమాత మదర్‌థెరిస్సా అని కొనియాడారు. ఆమె తన సామాజిక సేవల ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపును పొంది అమ్మ అయ్యారన్నారు. కలకత్తా మురికివాడల్లో ఆమె సేవలు స్ఫూర్తి దాయకమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ వెంకటేశ్వరరావు, యర్రా ఆంజనేయస్వామి, కె.సాయి, సత్యనారాయణరాజు, ఫణికుమార్, లియో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మాధురి, సాయిశృతి పాల్గొన్నారు.
పెనుమంట్ర : మదర్‌థెరిస్సా హెల్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్‌థెరిస్సా జయంతి వేడుకలు మండలంలోని నెగ్గిపూడిలో శనివారం ఘనంగా నిర్వహించారు. సంఘ వ్యవస్థాపకలు, జాతీయ అవార్డు గ్రహీత, డాక్టర్ సాకరాజు ఆధ్వర్యంలో మదర్‌థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘ అధ్యక్షుడు కర్రి మురళీశ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సాకరాజు మాట్లాడుతూ భారతరత్న మదర్‌థెరిస్సాను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు నక్కా నరేష్ పాల్గొన్నారు.
గణపవరం : గణపవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదర్‌థెరిస్సా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఉన్న రో గులకు పండ్లు, పాలు, రొట్టెలు అందించారు. చాణిక్య కాలే జీలో ఉన్న పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్, పాఠ్య పుస్త కాలు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయ కులు కాకర్ల వినాయక, సిహెచ్.రవికుమార్, అబ్దుల్ గఫూర్ ఖాన్, కె.విశారద, కె.సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
కాశిపాడులో ఉచిత వైద్య శిబిరం
మదర్‌థెరిస్సా జయంతి సందర్భంగా శనివారం కాశిపాడు ఆరోగ్య ఉపకేంద్రం వద్ద క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చారు. ఈ క్యాంపులో 75 మందికి షుగరు, బిపి, వైద్య పరీక్ష లు నిర్వహించి మందులు ఉచితంగా చేశారు. ఈ కార్యక్ర మంలో పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎఆర్‌కె. పరమేశ్వరరావు, సొసైటీ చైర్‌పర్సన్ కోట సత్యనారాయణ, రైతు భరోసా కేంద్రం అధ్యక్షులు సిహెచ్.సిల్వర్‌స్టార్ రాజు, ఆరోగ్య సహాయకులు, నామాల రాజు పాల్గొన్నారు.
పాలకోడేరు : ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని తన జీవితాన్ని సేవకు అంకితం చేసిన మదర్‌థెరిస్సా మహాత్మురాలని విస్సాకోడేరు సెయింట్ జాన్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ డిఆర్.స్వర్ణలత అన్నారు. విస్సాకోడేరు సెయింట్ జోన్స్ హైస్కూలులో మదర్‌థెరిస్సా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి హెచ్‌ఎం స్వర్ణలతతో పాటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వర్ణలత మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని నమ్మిన మొదటి వ్యక్తి మదర్‌థెరిస్సా అని అన్నారు. సేవకు మారుపేరుగా పేద ప్రజల ఆత్మబంధువుగా మదర్‌థెరిసా చరిత్రలో నిలిచిపోయారన్నారు. మదర్‌థెరిస్సా దేశానికి అందించిన సేవలు అపురూపమైనమని, ఆమెను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఆమె స్ఫూర్తితో అందరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
పాలకొల్లు : పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మదర్‌థెరిస్సా జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పది మందికి కూరగాయలు, ఇస్త్రీ, టిఫిన్ బండ్లను ధర్మారావు ఫౌండేషన్ తరపున ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు అందించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ తన తండ్రి పేరున సేవా కార్యక్రమాలు చేపట్టడానికి మదర్ థెరిస్సా, డాక్టర్ అంబేడ్కర్ జీవితమే ఆదర్శమన్నారు. మదర్‌థెరిస్సా, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆనాడు ధర్మారావు ఫౌండేషన్‌ను తన తండ్రి పేరున స్థాపించి వంద మంది వికలాంగులను, వంద మంది వృద్ధులను దత్తత తీసుకుని ప్రతి నెలా వారికి ఎనిమిది కేజీల బియ్యం, వారికి అవసరమైన వస్త్రాలు, దుప్పట్లు, మెడికల్స్ ఇచ్చే కార్యక్రమాన్ని నిరంతరంగా ఇప్పటివరకు కొనసాగిస్తున్నా నని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ పరిశీలకులు పెచ్చెట్టి చంద్రమౌళి, రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, జివి, పీతల శ్రీను, కర్నేన గౌరు నాయుడు, కడలి గోపి, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు.