నివాళులర్పిస్తున్న నాయకులు
ఘనంగా మదర్ థెరిస్సా జయంతి
ప్రజాశక్తి-కావలి:గుండెమడుగుల దేవదానం మెమోరియల్ హాస్పిటల్‌లో ''విశ్వమాత మదర్ థెరిస్సా జయంతి ''కార్యక్రమం శనివారం స్వచ్చంద సంస్థల, గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాష ఆధ్వర్యంలోఘనంగా జరిగింది. తొలుత డాక్టర్ ఎన్.ప్రభాకర్ నాయుడు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, మదర్ థెరిస్సా చిత్రపటానికి పుష్పమాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్.ప్రభాకర నాయుడు మాట్లాడారు.ఆమె చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ వినరు వినోద్ బాబు, స్వచ్చంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఖాదర్ బాషా, వివిధ సంస్థల, ప్రతినిధులు సంస్థలనిర్వాహకులు మొఘల్ సలీం బేగ్, మాలకొండారెడ్డి, రాయపాటి దిలీప్ కుమార్, షేక్ ఖాదర్‌బీ, ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.










