ప్రజాశక్తి - ఆదోని
మొట్టమొదటి భారతదేశ విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జీ దేవిశెట్టి ప్రకాష్, కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఛైర్మన్ ఎమ్‌ఎమ్‌డి.నూర్ మాట్లాడారు. నెహ్రూ కేబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బి.తాయన్న, ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ నెట్టేకల్ హనుమంతు, టౌన్ మైనార్టీ ఉపాధ్యక్షులు హుస్సేన్ బాష, కర్నూలు జిల్లా మైనార్టీ కార్యదర్శి బేగ్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కలందర్, సీనియర్ నాయకులు కుప్పగల్ అయ్యప్ప, కల్లుబావి రామన్న, అమరావతి నగర్ రామకృష్ణ, నిజాం, మహబూబ్ బాష, దొడ్డనకేరి లక్ష్మన్న, బల్లేకల్, నరసయ్య, దానప్ప, షేకన్న, బల్లేకల్ రామకృష్ణ పాల్గొన్నారు.
నివాళులర్పిస్తున్న నాయకులు