
ప్రజాశక్తి - పాలకొల్లు
సినీ దర్శకుడు కోడి రామకృష్ణ 74వ జయంతి పాలకొల్లు మారుతి సినిమా ధియేటర్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొల్లు కళా పరిషత్ అధ్యక్షులు కెవి.కృష్ణవర్మ మాట్లాడుతూ వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ లలిత కళాంజలి నాటక అకాడమీ అనే నాటిక సంస్థను స్థాపించి 33 ఏళ్లు జాతీయ నాటిక పోటీలు నిర్వహించారని చెప్పారు. అదే స్ఫూర్తితో పాలకొల్లు కళాపరిషత్ స్థాపించి 14 సంవత్సరాలుగా నాటిక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేడికొండ శ్రీనివాసరావు, మానాపురం సత్యనారాయణ, జక్కంపూడి కుమార్, కొణిజేటి గుప్త, విన్నకోట వెంకట రమణ, కోడి రామకృష్ణ, బాల్య మిత్రుడు కొయ్యాన సూర్యనారాయణ, మారుతి ధియేటర్ మేనేజర్ దేవళ్ల బుజ్జి పాల్గొన్నారు.
కోడి రామకృష్ణ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో పాలకొల్లు కళామతల్లి ముద్దబిడ్డలకు ఆదివారం రాత్రి అవార్డులతో సత్కారం జరిగింది. కీర్తిశేషులు కోడి రామకృష్ణ స్మారక సినీ అవార్డు గ్రహీతలైన పాలకొల్లుకు చెందిన లలిత కళాంజళి నాటక అకాడమీ అధ్యక్షుడు ఇయ్యపు రామలింగేశ్వరరావు, సినీ దర్శకులు శివాల ప్రభాకర్, సినీ నటుడు కొప్పినీడి ప్రశాంత, కొంతేరు గ్రామవాసి ఆకుమర్తి బాబూరావు అవార్డులు అందుకున్నారు. సినీ నటులు సుమన్, నిర్మాత తుమ్మలపల్లి సత్యనారాయణ సారధ్యంలో అవార్డులు అందుకున్నారు. అవార్డు గ్రహీతలకు పాలకొల్లు నటినట సంక్షేమ సమాఖ్య శుభాకాంక్షలు తెలిపారు.