
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: స్థానిక బ్యాంక్ కాలనీ అపార్ట్మెంట్ వద్ద సిపిఐ, రైతు సంఘం ఉద్యమ నేత, రాష్ట్ర నాయకులు కొల్లి నాగేశ్వరరావు 3వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, తదితరులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై పోరాటాలు చేశారని కొనియాడారు. నాగేశ్వరరావు ఆశయాలతో పంటలకు గిట్టుబాటు ధర, కౌలు రైతుల రుణాలు, భూములకు సాగు హక్కు కల్పన తదితర సమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు జి.గురుబాబు, డిసిహెచ్ క్రాంతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు శివ లంక కొండలరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గొల్లి కొండబాబు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి జీ.పణంద్ర, నర్సీపట్నం రూరల్ కార్యదర్శి నల్లబెల్లి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.