ఘనంగా కందుకూరి వీరేశలింగం జయంతి వేడుకలు
ప్రజాశక్తి-డోన్
పట్టణంలోని పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటసుబ్బారెడ్డి తెలిపారు.ఆదివారం పాఠశాల ఆవరణంలో కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ బాల్యవివాహాలను రూపుమాపాలని ప్రతిన పూనిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు అని కొనియాడారు. కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16 న రాజమండ్రి నందు జన్మించారని,అతి చిన్న వయసులోనే సామాజిక స్పృహతో బాల్య వివాహాలను అరికట్టడానికి,వితంతు వివాహాలను ప్రోత్సహించి,దాదాపు 40 జంటలకు వితంతు వివాహాలను జరిపించారని వివేకవర్దిని పత్రిక ద్వారా అనేక మందిని మేల్కొల్పారని అనేక గ్రంథాలను రచించారని ఆయనను గద్య తిక్కన బిరుదు తో సత్కరించారని అందుకే ఆయనను నవయుగ వైతాళికుడు అంటారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శివ ప్రసాద్,చంద్రశేఖర్ గౌడ్, సుబ్బారెడ్డి,లక్ష్మయ్య ,రాఘవేంద్ర,శ్రీనివాసులు, రాధ,మద్దిలేటి,మధుసూదన్ రెడ్డి,ఆదినారాయణ, మద్దిలేటి, భారతి, జయసుబ్బారాయుడు, లక్ష్మి ప్రభావతి,మునిరాజు,ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.










