Sep 09,2023 18:29

ప్రజాశక్తి - రేపల్లె
మండల తెలుగు యువత అధ్యక్షుడు కమతం శివ సుబ్రమణ్యం జన్మదిన వేడుకలు టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. యువతకు కమతం శివ ఆదర్శనీయుడని టిడిపి నాయకులు అన్నారు. 10సంవత్సరాలుగా నిరంతర ప్రజాసేవలో ఉన్న వ్యక్తి అని, వారి సేవలకు గుర్తుగా ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందారని అన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తని అన్నారు. అటువంటి నాయకుని జన్మదినం వేడుకలు  జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కమతం శివ సుబ్రహ్మణ్యంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.