Dec 28,2021 23:40

కర్నూలు డిసిసి కార్యాలయంలో జెండాను ఎగురవేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షులు అహమ్మద్‌ అలీఖాన్‌

ప్రజాశక్తి - విలేకరులు: భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ 137వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్‌కట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి గతవైభవం కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో సాధ్యమవుతుంతన్నారు.
కర్నూలు కలెక్టరేట్‌ :
కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా డిసిసి అధ్యక్షులు అహమ్మద్‌ అలీఖాన్‌ కాంగ్రెస్‌ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వ్యక్తమౌతుందన్నారు. పేద ప్రజల సక్షేమానికి, లౌకికవాదం కోసం, భారతదేశ ఐక్యత కోసం, సుపరిపాలన కోసం కాంగ్రెస్‌ పార్టీ అహర్నిశలు శ్రమించిందన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ సారథ్యంలో బిజెపి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి ప్రజలపై భారాలు మోపుతుందన్నారు. బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలంటే కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సంసిద్ధం కావాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు, కాంగ్రెస్‌ నాయకులు జాన్‌ విల్సన్‌ , అశోక రత్నం, రాజేష్‌, బతకన్న, మహిళా కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శిరువెళ్ల: శిరివెళ్ల మండలం చెన్నూరు గ్రామంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ చింతల మోహన్‌ రావు, పిసిసి అధికార ప్రతినిధి ఊకొట్టువాసు, నాయకులు జజ్జారీ మరియదాసు పాల్గొన్నారు. నంద్యాల (క్రైం) : నంద్యాల రాజీవ్‌ భవన్‌ కార్యాలయంలో నంద్యాల పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు జె.లక్ష్మీ నరసింహ యాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరవేశారు. అనంతరం జిల్లా కార్యాలయంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి కేక్‌ కట్‌ చేశారు. పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి భరత్‌ కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు షేక్‌ అబ్దుల్లా, గంధం మల్లేశ్వర్రెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఫారూక్‌, సహాయ కార్యదర్శి అబ్దుల్‌ రహమాన్‌, జిల్లా మైనార్టీ అధ్యక్షులు పఠాన్‌ హబీబ్‌ ఖాన్‌ పాల్గొన్నారు. ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి శంషుల్‌ హాక్‌ కేక్‌ కట్‌ చేశారు. ఆళ్లగడ్డ మండల అధ్యక్షులు బరగొడ్ల హుస్సేన్‌ బాష, వికలాంగుల సంఘం తాలూకా అధ్యక్షులు సంజీవ కుమార్‌, ఉపాధ్యక్షులు పవన్‌ శంకర్‌ రాయల్‌, హరున్‌ పాల్గొన్నారు. బనగానపల్లె : జాతీయ కాంగ్రెస్‌ స్థాపన చరిత్రలో అద్వితీయమైనదని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ నీతమ్మ అన్నారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర శాఖ ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. ఐక్యూఎసి కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.బడే సాహెబ్‌ అధ్యక్షత సమావేశం నిర్వహింబచారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆదోని: ఆదోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గ బాధ్యులు నీలకంఠప్ప, మాజీ కౌన్సిలర్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి దిలీప్‌ దోక మాట్లాడారు. యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మారుతి రావు, సీనియర్‌ నాయకుడు సాయినాథ్‌, జిల్లా కార్యదర్శి నూర్‌ అహ్మద్‌, యువజన నాయకుడు దేవిశెట్టి వీరేష్‌, ఐఎన్‌టియుసి అధ్యక్షుడు జయరాం పాల్గొన్నారు.