Sep 06,2023 20:16

వేడుకలలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి

రాజంపేట అర్బన్‌ : మండల పరిధిలోని ఊటుకూరు యాదవ కాలనీలో కష్ణాష్టమి వేడుకలు బుధ వారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం చిన్ని కష్ణుడు, గోపికల వేషధారణలో ఉన్న చిన్నా రులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ జగద్గురువు శ్రీకష్ణుడు బోధించిన గీతానుసారం ప్రజలందరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో నాగపథ్వీరెడ్డి, ఎంపిటిసి శ్రీనివాసరాజు, కష్ణారావు, సుండుపల్లి జడ్‌పిటిసి ఇస్మాయిల్‌, రాజేష్‌, పాలగిరి మల్లిఖార్జునరెడ్డి, కంబాయిగారి నరసింహులు, నాగరాజు, ఆకుల వెంకట సుబ్బయ్య, సుబ్బరాజు, నాగేశ్వర రావు, మలిశెట్టి పాండు, నరసింహులు పాల్గొన్నారు. తంబళ్లపల్లె : మండ లంలో బుధవారం కష్ణాష్టమి వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకు న్నారు. పిండివంటలతో ఆనందాన్ని పంచుకున్నారు. తంబళ్లపల్లె బి.పవన్‌ కుమార్‌ ,విజయలక్ష్మి దంపతుల కుమారుడు సంజరు కష్ణ, కుమార్తె తీక్షణ లకు శ్రీకష్ణుని , గోపికల వేషధారణ వేశారు.కలికిరి : మండలంలో అన్ని గ్రామాల్లో కష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కష్ణాష్టమిని పురస్కరిం చుకొని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో కష్ణుడికి పూజలు చేశారు. ఇంటిలో ఉండే చిన్నపిల్లలకి గోపికలు, కష్ణుని వేషధారణతో అలరించారు. ఉపాధ్యాయుడు కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో కష్ణుని విగ్రహానికి పూజలు నిర్వహించి, అటుకులు స్వీట్లు పంచుకున్నారు. రెడ్డివారిపల్లి, తపస్య విద్యాసంస్థలో కష్ణాష్టమి వేడు కలు కరస్పాండెంట్‌ రామానుజుల నా యుడు, ప్రిన్సిపల్‌ శివ ప్రసాద్‌ ఆధ్వర్యంలో కోలా హలంగా నిర్వహించారు. విద్యార్థులు కష్ణుడు గోపికల వేషాలతో అలరించారు. కొందరు విద్యార్థులు చిన్ని కష్ణయ్య ను తలుస్తూ నత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్‌ మాట్లాడుతూ విద్యా ర్థులందరూ మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని, ఉన్నత పదవులు పొందా లని తెలిపారు. కార్యక్రమంలో మాధవి, ప్రేమలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.కలకడ: మండలం లోని పలు గ్రామాలలో కష్ణుడు గోపికల వేషాలతో చిన్నారులను అలంకరించి అంగరంగ వైభవంగా కష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు మండలంలోని కోనకది రాయిచెరువు, గోపాలపురం, సింగనొడ్డుపల్లి, గువ్వల వారిపల్లి తదితర ప్రాంతాలలో వేడుకలు ఉత్సహంగా జరుపుకున్నారు.
నేడు ఉత్సవాల్లో పాల్గొనండి
మదనపల్లె అర్బన్‌ : పట్టణం అన్నపగుట్ట శ్రీవారు నగర్‌ గోవర్ధ నగిరిలో గురువారం కష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిం చనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉదయం 5 గంటలకు అబి óషేకాలు, 9 గంటలకు కల్యాణోత్సవం, 11 గంటలకు సాంస్క తిక కార్యక్రమాలు, మూడు గంటలకు వసంతోత్సవం, స్వామి వారి ఊరేగింపు నిర్వహించ నున్నట్లు తెలిపారు. అభిషే కంలో పాల్గొనాలని అనుకునే భక్తులు రూ.750 చెల్లించి అభిషేకంలో పాల్గొనవచ్చున్నారు. కల్యాణోత్సవంలో పాల్గొ నాలని ఆసక్తి ఉన్నవారు రూ.1016 రూపా యలు చెల్లించాలన్నారు. అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నేడు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకష్ణుని కల్యాణం
నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామపంచాయతీ, అరవ పల్లెలోని శ్రీ కష్ణ గీతా మందిరంలో శ్రీకష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని గురువారం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకష్ణుని కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కుర్రా మణియాదవ్‌ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఉదయం 8 గంటలకు గోపూజ, 9 గంటలకు పసుపులేటి శివశంకర్‌ ఆధ్వర్యంలో సత్య సంఘము, 9.30గంటలకు కల్యాణ మహోత్సవము, 12 గంటలకు రాజంపేట నియో జకవర్గ నాయకులు మేడా విజయశేఖర్‌రెడ్డి సౌజన్యంతో పెద్ద ఎత్తున భక్తు లకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం నాలుగు గంటలకు గ్రామో త్సవం, ఊరేగింపులో చెక్కభజన, శ్రీ వారి కోలాటం, రాత్రి 8 గంటలకు ఆలయం దగ్గర పెద్ద ఎత్తున బాణాసంచా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అల్పాహార విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కష్ణాష్టమి వేడుకలలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి