Apr 11,2023 17:06

జ్యోతిరావు చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఎంపీడీవో వెంకటరమణ

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి
ప్రజాశక్తి - పగిడ్యాల

    మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతిని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో వెంకటరమణ, ఈ ఓడి పుల్లయ్య, జడ్పిటిసి పుల్యాల దివ్య, ఎంపీపీ మండ్ల మల్లేశ్వరి మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మద్దిలేటి, ఏపిఎం శ్రీనివాసులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.