ప్రజాశక్తి - అనకాపల్లి : ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు సందర్భంగా స్థానిక రింగ్ రోడ్డు డివిఆర్ కార్యాలయంలో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ సమక్షంలో కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎంపిపి గొర్లి సూరిబాబు ఆధ్వర్యంలో గోపాలపురంలో సిఎం జన్మదిన వేడుకలు నిర్వహించారు.
బుచ్చయ్యపేట : మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఐతంపూడి, రాజాం గ్రామాల్లో కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.
వడ్డాది : వడ్డాది జిల్లా పరిషత్తు హైస్కూల్లో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపికైన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దొండా రాంబాబు, వైస్ ఎంపిపి దొండా లలితా నారాయణమూర్తి, వైసిపి నాయకులు కొల్లిమల్ల అచ్చం నాయుడు పాల్గొన్నారు.
అనకాపల్లి : ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక వైసిపి కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ రక్తదానం చేశారు. వైసిపి పరిశీలకులు ఎస్‌ఏ రెహమాన్, ఎంపీ డాక్టర్ బివి.సత్యవతి, వైసిపి నాయకులు దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు, ఎంపీపీ సూరిబాబు సమక్షంలో కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరానికి సహకరించిన మంత్రిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఘనంగా సత్కరించింది.
దేవరాపల్లి : వైసిపి ఆధ్వర్యాన స్థానిక రైవాడ రిజర్వాయరు అతిథి గృహంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ప్రారంభించారు. అనంతరం జగనన్న భూరక్ష పథకం కింద పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కె.కోటపాడు, దేవరాపల్లి జెడ్‌పిటిసిలు ఈర్లే అనురాధ, కర్రి సత్యం, ఎంపిపి కిలపర్తి రాజేశ్వరి, వైస్ ఎంపిపి చింతల భూలక్ష్మి మాజీ ఎంపిపి కిలపర్తి భాస్కరరావు, వైసిపి నాయకులు బూరె బాబురావు పాల్గొన్నారు.
పరవాడ : స్థానిక సంతబయలు వద్ద మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహానికి ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. జడ్పీటీసీ పైల సన్యాసిరాజు కేక్ కట్ చేశారు. మరిడిమాంబ కల్యాణమండపం వద్ద మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. వైస్ ఎంపీపీలు బంధం నాగేశ్వరరావు, బూస అప్పలరాజు, వైసిపి నాయకులు రాము నాయుడు, కోన రామారావు పాల్గొన్నారు.
మునగపాక రూరల్ : రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యాన మండలంలోని వాడ్రాపల్లిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సర్పంచులు దిమ్మల అప్పారావు, బీశెట్టి గంగప్పలనాయుడు బొడ్డేడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సబ్బవరం : స్థానిక వైసిపి కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు కర్రి బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ప్రారంభించారు. ఎంపీపీ బోకం సూర్యకుమారి రామునాయుడు, జెడ్‌పి వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు, వైసిపి నాయకులు కోటాన రాము పాల్గొన్నారు. మండలంలోని పైడివాడ అగ్రహారం సచివాలయం ప్రాంగణంలో నాయకులు రమేష్ నాయుడు ఆధ్వర్యంలోనూ, అసకపల్లి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీను, ఆదినాయుడు ఆధ్వర్యంలోనూ మొక్కలు నాటారు.
కశింకోట : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్‌పిపి కలగా లక్ష్మి, వైస్ ఎంపిపి పెంటకోట జ్యోతి కేక్ కట్ చేశారు. మొక్కలు నాటారు. వైసిపి నాయకులు మళ్ళ బుల్లి బాబు ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తహశీల్దారు బి.సుధాకర్, సర్పంచ్ మంత్రి జయరజిని పాల్గొన్నారు. ఉగ్గినపాలెంలో సర్పంచ్ కలగా గున్నయ్య నాయుడు, తాళ్ళపాలెంలో ఎంపిటిసి లగిశెట్టి భవాని ఆధర్యాన సిఎం జన్మదిన వేడుకలు జరిగాయి.
అచ్యుతాపురం : ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా అచ్యుతాపురంలో వృద్ధ మహిళలకు ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు చేతుల మీదగా చీరలు పంపిణీ చేశారు. కేక్ కట్ చేశారు. మండల వికలాంగుల పాఠశాల ఆవరణలో వికలాంగుల మధ్య బొడ్డేడ ప్రసాద్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. జాతీయ అవార్డు గ్రహీత పిఎస్‌టి పట్నాయక్‌కు వైసీపీ నాయకులు పి వెంకటపతి రాజు రూ.10వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
చోడవరం : ముఖ్యమంత్రి జగన్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ చోడవరంలోని ఓ ప్రైవేట్ ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను విప్ కరణం ధర్మశ్రీ బుధవారం ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. రక్తదానం శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు. మండలం పరిషత్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాడి కాసు, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యరావు, వైసిపి నాయకులు పల్లా నర్సింగరావు, ఓరుగంటి నెహ్రూ పాల్గొన్నారు.
కొత్తకోట:రాష్ట్ర రావికమతం మండలంలో మత్యవానిపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీ భీశెట్టి సత్యవతి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీలు మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసి చరిత్రలో నిలిచిన సీఎం జగన్ జన్మదిన వేడుకలు పండగలా రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవడం ఆనంద దాయకం అన్నారు. దుస్తులను, పండ్లను పేదలకు పంపిణీ చేశారు. జగనన్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైల రాజు, వైస్ ఎంపీపీ దంట్ల వెంకటరమణ, మత్యా భవాని ప్రసాద్, గ్రామ సర్పంచ్ మలిసెట్ల గణేష్, ఎంపీటీసీ లోవరాజు, చోడవరం మార్కెట్ కమిటీ చైర్మన్ రాజాన నర్సింహులు, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు సన్యాసినాయుడు, ఆగ్రో అడ్వైజర్ కమిటీ చైర్మన్ కంచిపాటి జగ్గారావు తదితరులు పాల్గొన్నారు..
మాడుగుల:స్థానిక బస్ స్టాండ్ వద్ద రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. స్థానిక సేయింట్ ఆన్స్ వృద్ధాశ్రమంలో దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెదబాబు, వైస్ ఎంపిపి తాలపురెడ్డి రాజారాం, సర్పంచ్ కళావతి, వైస్ సర్పంచ్ శ్రీనాథు శ్రీనివాసరావు, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, షీలా మంతుల జ్యోతి, కుక్కర శ్రీధర్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లి:నక్కపల్లిలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పాయకరావుపేట నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు చింతలపూడి వెంకటరామయ్య కేకును కట్ చేసి పంపిణీ చేశారు.స్థానిక సిహెచ్‌సిలో రోగులకు రొట్టె, పాలు పంపిణీ చేశారు. హాకీ పొటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు పొడగట్ల పాపారావు, జడ్పిటిసి గోసల కాసులమ్మ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు వెలగా ఈశ్వరరావు, వైసిపి నాయకులు అయినంపూడి మణి రాజు, గంటా తిరుపతిరావు, తళ్ళ భార్గవ్, కొల్లాటి బుజ్జి , నవర నూకరాజు శర్మ, సర్పంచులు జయ రత్న కుమారి, సాదిరెడ్డి శ్రీనివాసరావు, శంకర్రావు, హాకీ క్లబ్ ప్రధాన కార్యదర్శి కే.తాతాజీ పాల్గొన్నారు .
నర్సీపట్నంటౌన్: స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని కొనియాడారు. డిసిసిబి చైర్ పర్సన్ అనిత సన్యాసి పాత్రుడు దంపతుల కుమారుడు వరుణ్ కేక్ కట్ చేసి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో వృద్ధులకు, రోగులకు పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
పాయకరావుపేట: పట్నంలో వైఎస్‌ఆర్ విగ్రహానికి శాసనసభ్యులు గొల్ల బాబురావు, వ్యవసాయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేశారు.స్థానిక జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ వద్ద పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, సర్పంచ్ గార ప్రసాద్, జడ్పిటిసి లంక సూరిబాబు, మండల పార్టీ అధ్యక్షులు బాబురావు, దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ, చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా వ్యవసాయ అభివృద్ధి సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు, ఎంపీపీ పార్వతీ తాతారావు, పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు
చీడికాడ:మండల కేంద్రంలో పార్టీ గ్రామ అధ్యక్షులు పరవాడ మహేష్, మండల కన్వీనర్ రాజబాబు ల ఆధ్వర్యంలో ఎంపీపీ కురిచ జయమ్మ, జడ్పిటిసి వేలం శారద వరలక్ష్మిలు కేక్ కట్ చేశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రొట్టెలు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ యూత్ అధ్యక్షుడు స్వామి నాయుడు, నాయకులు అప్పారావు లాలం జానకిరామ్, నారాయణమూర్తి పాల్గొన్నారు.
కోటవురట్ల:కైలాసపట్నం గ్రామంలో జడ్పిటిసి సభ్యురాలు ఉమాదేవి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు పాల్గొన్నారు. మహిళలకు చీరల పంపిణీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు.
రోలుగుంట:స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్లమెంట్ సభ్యురాలు బి.సత్యవతి ముందుగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు.మండల అధ్యక్షుడు మడ్డు అప్పలనాయుడు, శెట్టిపల్లి వెంకటరమణ, యర్రంశెట్టి బాబురావు పాల్గొన్నారు. కుసర్లపూడి హైస్కూల్‌లో సర్పంచ్ మడ్డు అప్పలనాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్ధులకు పంపిణీ చేశారు.










