Jul 08,2023 21:39

కేకు కట్‌ చేస్తున్న టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జగదీశ్వరి

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం :  టిడిపి కురుపాం నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి జన్మదిన వేడుకలను శనివారం గుమ్మలక్ష్మీపురంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆమె కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఐదు మండలాలకు చెందిన టిడిపి నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, తెలుగు యువత అధ్యక్షులు కోలా రంజిత్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.