
ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లు జివిఎస్‌విఆర్‌ఎం మున్సిపల్ పాఠశాలలో హెచ్‌ఎం రాయపూడి భవానీప్రసాద్ అధ్యక్షతన సోమవారం వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అతిథిగా హాజరైన కెవిఎస్.రాజు మాట్లాడుతూ విద్యార్థులు వృద్ధులకు మద్దతునిస్తూ సమాజంలో వారి భాగస్వామ్యాన్ని గుర్తించి, అభినందించడం కోసం వృద్ధుల దినోత్సవం నిర్వహించుకుంటున్నామని చెప్పారు. 1988 ఆగస్టు 21న అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ దినోత్సవం ప్రకటనపై సంతకం చేశారని చెప్పారు. ప్రస్తుతం చిన్న చిన్న కుటుంబాలు అయిపోయి ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడి, తల్లిదండ్రులను రోడ్డుపైకి వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు వారి తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వృద్ధాశ్రయాలు ఎక్కువ అయ్యాయని చెప్పారు. చిన్నతనంలో వాళ్లు మనపై చూపిన ప్రేమ గుర్తించి, చివరి సమయంలో వారిని చక్కగా చూసుకోవాలని విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో చిరు సత్కారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.