రాజంపేట అర్బన్ : జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం ఉపాధ్యక్షులు ఎం.వి.రమణ, ప్రధాన కార్యదర్శి డి.వి.ఎస్.రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం రమణ ప్రాథమిక చికిత్సాలయంలో వైద్యుల దినోత్స వాన్ని పురస్కరించుకొని కేక్‌కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిధాన్ చంద్రరారు, డాక్టర్ బి.సి.రారు జన్మదినాన్ని పుర స్కరించుకుని ప్రతి ఏటా జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం జరుపు కుంటు న్నామని అన్నారు. అనంతరం ఎం.వి.రమణ, డి.వి.ఎస్.రాజులను గ్రామీణ వైద్యులు శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్య క్రమంలో ఆర్‌ఎంపి వైద్యులు వైసిఎస్.రాజు, సిద్దు కష్ణారెడ్డి, ప్రవీణ్‌కుమార్, నాగరాజు, బి.కుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు.పీలేరు : ఆసుపత్రికి వచ్చే రోగిని అతిథిగా భావించి వారి అరోగ్య సమస్యలకు తగిన వైద్యం అందించే ఆరోగ్య ప్రధాతలైన వైద్యాధికారులు డాక్టర్ రమేష్‌రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్‌లను సన్మానించారు. జాతీ య డాక్టర్ల దినోత్సవం సందర్భంగా తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది వైద్యాధికారులను దుశ్శాలువ, పూలమాలతో సత్కరించారు. కార్యక్ర మంలో హెల్త్ ఎడ్యుకేటర్ కొండయ్య, పర్య వేక్షకులు కుసుమ, ఫార్మసిస్టు, స్టాఫ్ నర్స్ లక్ష్మి, శిరీష ,అనిత, ల్యాబ్ టెక్నీషియన్ కుమార్, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
నందలూరు : సత్కారం అందుకుంటున్న డాక్టర్ రమణ










