ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్
గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఒంగోలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మహిళాభ్యు దయ సమితి, నరసం ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు తేళ్ళ అరుణ మాట్లాడుతూ మహిళలకు స్ఫూర్తి ప్రదాత, ఆదర్శ మహిళ, ఉక్కు మహిళగా ఖ్యాతి గాంచిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పుట్టినరోజున నగరంలో ప్రముఖ మహిళలను సత్కరించటం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ మహిళా న్యాయవాది, సమాజసేవకురాలు దేవకుమారి, ప్రముఖ గాయని, ఉపాధ్యాయిని మున్నంగి ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మున్నంగి రాజకుమారిని ఘనంగా సత్కరించారు. ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మహబూబ్ బాషా వారి సంస్థ తరపున విద్యార్థులకు బిస్కెట్లు పళ్లు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, ఉప గ్రంథాలయ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి, లైబ్రేరియన్ సంపూర్ణ, నరసం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షురాలు మారేపల్లి సూర్యకుమారి, కె శాంతిలతశ్రీ, నాగభైరవ ఆదినారాయణ, డాక్టర్ నూనె అంకమ్మరావు, కుర్రా ప్రసాద్ బాబు, నాళం నరసమ్మ, ధర్నాశి చిరంజీవి, మా మూర్తి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.