Jan 25,2023 00:08

కె.కోటపాడులో మానవహారం నిర్వహిస్తున్న అంగన్వాడీలు

ప్రజాశక్తి-యంత్రాంగం
జాతీయ బాలికా దినోత్సవాన్ని మంగళవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు.
ఆరిలోవ : చినగదిలి ప్రభుత్వ బాలికల వసతి గృహంలో బాల వికాస ఫౌండేషన్‌ ఆధ్వర్యాన జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల వికాస ఫౌండేషన్‌ కార్యదర్శి నరవ ప్రకాశరావు, భరణికాన రామారావు, వసతి గృహం అధికారి ఎవిఎస్‌.సునీత, డాక్టర్‌ బాబ్జీ పాల్గొన్నారు.
పెందుర్తి: జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శాఖ గ్రంథాలయం ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్‌ ఇంగ్లీష్‌ ఉపాధ్యాయులు బి.సుజాత, గ్రంథాలయాధికారి బి.సూర్యకళ, ఎ.ఆదినారాయణ, బాలికలు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
భీమునిపట్నం : జివిఎంసి రాయిపాలెం ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం జయంతి రాధాకుమారి ఆధ్వర్యాన, ఒకటో వార్డు పరిధి బంగ్లామెట్ట ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం రెడ్డిపల్లి అప్పలరాజు అధ్యక్షతన బాలికా దినోత్సవాలు నిర్వహించారు. భీమిలి మండలం, చిప్పాడ జెడ్‌పి హైస్కూల్‌లో హెచ్‌ఎం రేఖ అప్పారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాళ్ళవలస పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ శోభారాణి, డాక్టర్‌ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. బాలికా దినోత్సవం ప్రాధాన్యతను తెలిపేలా ఆయా పాఠశాలల్లో విద్యార్థినులు ముగ్గులు వేశారు.
ఆనందపురం : కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో బాలికా దినోత్సవం నిర్వహించారు. డిసిడిఒ డాక్టర్‌ ఖలీశా బేగమ్‌ బాలికలను ఉద్దేశించి ప్రసంగించారు సెల్ఫ్‌ డిఫెన్స్‌ అంశంపై విద్యార్థులకు పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పోటీల్లో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కస్తూరిబా గాంధీ ప్రత్యేక అధికారి చంద్రకళ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌ : అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా స్థానిక బాలయోగి గురుకులం వద్ద వేములపూడి శ్రీ వేమ స్వచ్ఛందసంస్థ, అనకాపల్లి కనకం ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు శ్రీ వేమ సంస్థ కార్యదర్శి బోలెం శివ మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు, లింగవివక్షను ఎదుర్కోవడం, గుడ్‌టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈసందర్భంగా మొక్కలు నాటారు. బాలికలకు న్యూట్రీషన్‌ ఫుడ్‌ అందజేశారు.
నర్సీపట్నం టౌన్‌ : యువతులను ప్రభావితం చేసే సామాజిక సమస్యల నుంచి విముక్తి కల్పించేలా చుట్టూ ఉన్నవారు సహకరించాలని ఐసిడిఎస్‌ ఎసిడిపిఒ శ్రీగౌరీ అన్నారు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా మండలంలోని వేములపూడి కేజీబీవీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసిడిఎస్‌ సూపర్వైజర్లు సరోజినీ రామలక్ష్మి, రమణమ్మ, స్థానిక పిహెచ్‌సి డాక్టర్‌ అనూష, హెచ్‌వి పివి.లక్ష్మి, సూపర్వైజర్‌ ఎం రుక్మిణి మహిళా పోలీసు సోము దేవి, స్కూల్‌ ప్రిన్సిపల్‌ శాంతి, అంగన్వాడీ కార్యకర్తలు ఆశాజ్యోతి దేవి, రేవతి ఎర్రి అమ్మ, బివి లక్ష్మి, సరోజిని పాల్గొన్నారు
కోటవురట్ల : జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సచివాలయ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు, కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ అనిల్‌ కుమార్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కొండబాబు,ఎంపిటిసి పి సూర్యారావు, వార్డు సభ్యులు జానకి హరిబాబు పాల్గొన్నారు.
మాకవరపాలెం. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా మాకవరపాలెం హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సిడిపిఒ సుజాత స్త్రీ ప్రాముఖ్యత, బాలికల ఔన్నత్యం, సమాజంలో మహిళల ఆధిపత్యం, వివిధ ఉద్యమాల్లో మహిళల పాత్ర, సాధించిన విజయాలపై విద్యార్థులకు వివరించారు. హెచ్‌ఎం అచ్యుతరామయ్య, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్లు ఆర్‌ సత్యవతి, ధనమ్మ పాల్గొన్నారు
గొలుగొండ : జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎఎల్‌పురంలో పిహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్‌ ఎస్‌.గాయత్రి, డాక్టర్‌ హరిప్రవీణ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆడపిల్లలను రక్షించుకుందామంటూ నినాదాలు చేశారు. అనంతరం మానవహారం చేపట్టారు.కార్యక్రమంలో అంగన్వాడీలు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అనకాపల్లి : సమాజంలో లింగ వివక్షపై అవగాహన ఉండాలని, లింగ వివక్షను రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఎంఏఎల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి జయ బాబు అన్నారు. కళాశాలలో మంగళవారం కళాశాల మహిళా సాధికారత విభాగం, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ మహిళల పట్ల చిన్న చూపు సరికాదని, భ్రూణ హత్యలు రూపు మాపేలా సమాజంలో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం బాలికలను రక్షిద్దాం, కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ ఎం.హరిబాబు, మహిళ సాధికారత విభాగం కన్వీనర్‌ సామ్రాజ్యం, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్‌ నిరంజన్‌, కళాశాల సూపరింటెండెంట్‌ అనురాధ, కెమిస్ట్రీ విభాగాధిపతి శ్యామల పాల్గొన్నారు.
కె.కోటపాడు : బాలికలు కుటుంబానికి కాకుండా సమాజానికి వెలుగు లాంటి వారిని ఎంపీడీవో కె.శచిదేవి అన్నారు. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఐసిడిఎస్‌ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలురు కన్నా బాలికలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని, వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ మంగతాయారు, ఐకెపి ఎపిఎం శ్రీలక్ష్మి, బిపిఏ వెంకటరావు, కె కోటపాడు దేవరాపల్లి మండలాల అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.
వడ్డాది : సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాత్యాలను ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఎదుర్కోవాలని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి కోసూరి అన్నపూర్ణ, ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ రాజేశ్వరి అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వడ్డాది కెజిబివి, ఎంపిపి మెయిన్‌ స్కూల్‌, మంగళాపురం ఎంపీపీ స్కూల్‌ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ హెచ్‌ఎం టివి శేషగిరి, మహిళ పోలీస్‌ మహాలక్ష్మి, అంగన్వాడి కార్యకర్తలు రాధాలక్ష్మి, అమ్మాజీ సిబ్బంది పాల్గొన్నారు.