
ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లు లయన్స్ క్లబ్ సారధ్యంలో లయన్స్ కమ్యూనిటీ హాలులో శుక్రవారం ఇంజినీర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్ బాబ్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు పెనుమాక రామ్మోహన్‌ను ఘనంగా సత్కరించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు అరుణ, కార్యదర్శి మాఘం నారాయణరావు, కోశాధికారి డివివి.ప్రసాద్, పాటపళ్ల నాగదుర్గవరప్రసాద్, ఎన్‌విఎస్.పాపారావునాయుడు సారధ్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాదిరెడ్డి బాబూజీరావు, డాక్టర్ ముచ్చర్ల సంజరు హాజరయ్యారు. లయన్స్ క్లబ్ ఇంజినీర్లు రేపాక నాగ శ్రీరామారావు, రవికుమార్, చినిమిల్లి నాగేంద్రప్రసాద్, మాటూరి రామ్‌కుమార్, ఎంవిఆర్ నాగార్జున, ఎన్‌హెచ్.జయంతి, శిడగం ఈశ్వర్, మాఘం విష్ణు, పాటపళ్ల దుర్గా శ్రీనివాస్, పాటపళ్ల నాగ సందీప్, రేపాక యశ్వంత్ రాజ్‌లను సత్కరించారు. జివిఎస్‌విఆర్‌ఎం మున్సిపల్ పాఠశాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం రాయపూడి భవానీప్రసాద్ మాట్లా డుతూ విశ్వేశ్వరయ్య దేశంలోని ప్రముఖ కట్టడాలు నిర్మించా రని చెప్పారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో రోటరీ క్లబ్ ప్రెస ిడెంట్ పెనుమాక రామ్మోహన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజి నీర్లను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ బివిఆర్.శేషాద్రిని సత్కరించారు.
తణుకు : తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ జిల్లా డిప్యూటీ గవర్నర్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో స్వర్ణ క్లబ్ భవనంలో పురపాలక సంఘం ఇంజినీర్లు డిఇ కె.ఈశ్వర్‌రెడ్డి, ఎఇలు రామ్‌కిషోర్, శిరీషలను సన్మానించి జ్ఞాపికలు అందించారు. అనంతరం స్వర్ణ, మైత్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయకుడి మట్టి ప్రతిమలను అందించారు.
మొగల్తూరు : ముత్యాలపల్లిలో ఆరోగ్య వర్షిని వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి విద్యార్థులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ కార్యదర్శి నాగిడి రాంబాబు, గుడాల తాతారావు, బొక్క రాజేశ్వరి పాల్గొన్నారు.
పాలకోడేరు : నేటి యువత మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని భీమవరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ కొప్పర్తి సురేష్ సూచించారు. పెన్నాడలోని భీమవరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ కళాశాలలో శుక్రవారం ఇంజనీర్స్ డే సందర్భంగా అనేక టెక్నికల్ ఈవెంట్స్ నిర్వహించారు. కాంపిటీషన్స్‌లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
సర్ సివి.రామన్ పాఠశాలలో..
భారతదేశ ప్రప్రథవ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా శృంగవృక్షంలోని సర్ సివి.రామన్ పాఠశాలలో ఇంజినీర్స్ డేను ఘనంగా నిర్వహిం చారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ శిరీషాబాలకృష్ణ, పాఠశాల ప్రిన్సిపల్ జి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
భీమవరం రూరల్ : ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందాలంటే సివిల్ ఇంజినీరింగ్ నిపుణులు అద్భుత కట్టడాలు భావితరాలకు ఉపయోగపడే రీతిలో నిర్మించాలని పలువురు ప్రముఖ ఇంజినీర్లు యువ ఇంజనీర్లకు సూచించారు. భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ సివిల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ విభాగం, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ల ఆధ్వర్యంలో నిర్వహించారు.రిటైర్డ్ ఆర్‌అండ్‌బి సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.సూర్యనారాయణరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జె.వెంకటకృష్ణ, ఎఇ ప్రసాద్‌రాజులను ఘనంగా సత్కరించారు.
ఆకివీడు : స్థానిక లయన్స్ క్లబ్ హాలులో ఆరుగురు ఇంజినీర్లకు సన్మానం చేశారు. లయన్స్ సీనియర్ నాయకులు సత్యనారాయణరాజు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : ఇంజినీర్లు దేశ ప్రగతికి రూపశిల్పులని ఎపి నిట్ డీన్ అకాడమిక్ డాక్టర్ టి.కురుమయ్య సూచించారు. నిట్ ఇన్‌ఛార్జి డైరెక్టర్ డాక్టర్ ఎం.ప్రమోద్ పడోలే ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్‌శంకర్‌రెడ్డి పర్యవేక్షణలో సంస్థ ప్రాంగణంలోని పరిపాలనా భవనం వద్ద ఇంజినీర్స్ డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కురుమయ్య హాజరయ్యారు. విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య ఆధ్వర్యంలో పలుచోట్ల ఇంజనీర్స్ డే వేడుకలు నిర్వహించారు.