Sep 15,2022 23:21

ఇంజినీర్స్‌ డే వేడుకల్లో పాల్గొన్న పోర్టు చైర్మన్‌ రామ్మోహనరావు

ప్రజాశక్తి-యంత్రాంగం
విశాఖ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఇంజినీర్స్‌ డే ను గురువారం ఘనంగా నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్మరించుకుంటూ పలువురు ఇంజీనిర్లను సన్మానించారు.

విశాఖ పోర్టులో...
గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ పోర్టు ట్రస్ట్‌లో 1997, 2022, 2005, 2007 సంవత్సరాల్లో చీఫ్‌ ఇంజినీర్లుగా పనిచేసిన నలుగురిని అతిథులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రా యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఇంజినీర్లకు ఆరాధ్యదైవంగా భావించే మోక్ష గుండం విశేశ్వరయ్య 1939లోనే బలమైన ఇంజినీరింగ్‌ వ్యవస్థను ప్రారంభించారన్నారు. త్వరలో ఏయూలో ఆ-హబ్‌ ప్రారంభించి ఇంజినీరింగ్‌ నైపుణ్యాలను వెలికితీసే ప్రక్రియను చేపట్టనున్నట్లు విసి ప్రకటించారు. పోర్టు చైర్మన్‌ కె.రామ్మోహనరావు మాట్లాడుతూ, ఇంజినీర్లే 'దేవుళ్లు' అని కొనియాడారు. టెక్నాలజీ అంతా వారిపైనే ఆధారపడి ఉందన్నారు. వేదికపై పోర్టు డిప్యూటీ చైర్మన్‌, మెకానికల్‌ చీఫ్‌ ఇంజినీరు హరికృష్ణ, సివిల్‌ ఇంజినీరు వేణుప్రసాద్‌ ఉన్నారు.
ఈపీడీసీఎల్‌ కార్యాలయంలో..
విశాఖపట్నం ప్రతినిధి : ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని నిర్వహించారు. మోక్షగుండం చిత్రపటానికి ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ సివి.నాగార్జునరెడ్డి, సెక్రటరీ కె.రాజబాపయ్య, ఈపీడీసీఎల్‌ సిఎండి కె.సంతోషరావు, డైరెక్టర్లు డి.చంద్రం, బి.రమేష్‌ ప్రసాద్‌, సిజిఎంలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్‌డీ సిజిఎం ఏవీవీ సూర్యప్రతాప్‌, సీజీఎంలు వి.విజయలలిత, డి.సుమన్‌ కల్యాణి, ఓ.సింహాద్రి, సి.శ్రీనివాసమూర్తి, ఎస్‌.మసిలామని, బి.రామచంద్రప్రసాద్‌, జె.శ్రీనివాసరావు, ఎ.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
జివిఎంసిలో...
ఎంవిపి కాలనీ : జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని మేయర్‌ చాంబర్లో ఇంజినీర్లను సత్కరించారు. ఇంజినీర్లు అందరికీ మేయర్‌ గొలగాని హరివెంకట కుమారి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీరు రవికృష్ణరాజు, పర్యవేక్షక ఇంజినీర్లు, కార్యనిర్వాహణ ఇంజినీర్లు పాల్గొన్నారు
పెందుర్తి : నరవలోని విశాఖ ఇంజినీరింగ్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కళాశాలలో మోక్షగుండం జయతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి మాజీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ మత్స్యరాజు, ప్రిన్సిపల్‌ శ్రీధర్‌ పట్నాయక్‌, డైరెక్టర్‌ ఎమ్‌వికె.శ్రీనివాసరావు, సివిల్‌ విభాగాధిపతి భార్గవి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీలో సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘన నివాళులర్పించారు. విశ్వవిద్యాలయంలోని విశ్వేశ్వరయ్య భవన్‌లో మోక్షగుండం విగ్రహం వద్ద వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ దయానంద సిద్దవటం, ప్రొ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ వారియర్‌, పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
గీతంలో జరిగిన మరో కార్యక్రమంలో గీతం అధ్యక్షులు ఎమ్‌.శ్రీభరత్‌ మాట్లాడారు. ప్రస్తుత కాలంలో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ , కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ విభాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యాయని, ప్రతిభావంతులు సమగ్ర అవగాహనతో వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.
తగరపువలస : అవంతి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీర్స్‌ డే వేడుకలు జరిగాయి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎపిఇపిడిసిఎల్‌ డైరెక్టర్‌ రమేష్‌ ప్రసాద్‌, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌వి.గణేష్‌, డైరెక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌, పరిపాలనాధికారి సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.