
ప్రజాశక్తి - ఏలూరు టౌన్
ఉక్కు మహిళ, భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 36వ వర్థంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అధ్యక్షతన ఇందిరమ్మ చిత్రపటానికి పూలాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఆనాడు బ్యాంక్‌లను జాతీయం చేసి దేశాభివృద్ధికి నాంది పలికారన్నారు. పేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దండుబోయన చంద్రశేఖర్, గౌడు రంగబాబూ, బ్లాక్ టూ ప్రెసిడెంట్ లంక రామ్మోహన్ రావు పాల్గొన్నారు.