ప్రజాశక్తి-చీడికాడ:మాజీ ప్రధాని, కీర్తిశేషులు ఇందిరాగాంధీ జయంతి వేడుకలను చీడికాడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తమరాన చిన్ననాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్‌రావు ఇందిరమ్మ విగ్రహాన్నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మండల కొండబాబు, మండల నాయకులు పాల్గొన్నారు
చీడికాడ శాఖా గ్రంధాలయంలో గ్రంథాలయ అధికారిని ఎంఎస్‌ఎల్ జోగేశ్వరి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. సర్పంచ్ గాలి సామాలమ్మ, మాజీ ఎంపీపీ పోతల రమణమ్మ పాల్గొన్నారు.వివిధ పాఠశాలలకు చెందిన 50మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారని జోగేశ్వరి తెలిపారు.
కోటవురట్ల:మండల కేంద్రంలో శాఖ గ్రంధాలయంలో ఇందిరా గాంధీ జయంతోత్సవం నిర్వహించారు. ఏఎస్‌ఐ సూర్యనారాయణ, కానిస్టేబుల్ జగదాంబ విద్యార్థులకు దిశ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్, కేజీబీవీ బాలికలు, ఆయా పాఠశాలల సిబ్బంది, శాఖ గ్రంథాలయ అధికారి అప్పలనాయుడు పాల్గొన్నారు.
రోలుగుంట: స్థానిక గ్రంథాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు అప్పారావు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు గ్రంథాలయాధికారి ఎస్.వరలక్ష్మి తెలిపారు. ఈ పోటీల్లో 56 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
పాయకరావుపేట: వైయస్సార్ శాఖాగ్రంధాలయంలో ఇందిరాగాంధీ, ఝాన్సీ లక్ష్మీ భారు జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ గ్రంధాలయ సంస్ధ చైర్మన్ తోట నగేష్, గ్రంధాలయాధికారి వామాల లక్ష్మణరావు, ధనిశెట్టి మాధవి, జగతా శ్రీనివాసరావు, ఇసరపు తాతారావు, తోట లచ్చబాబు పాల్గొన్నారు.స్థానిక సూర్య మహల్ సెంటర్‌లో ఇందిరా గాంధీ విగ్రహనికి పిసిసి డెలిగేట్ తాళ్ళూరి విజరు కుమార్ పూల మాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెరుమాళ్లు వెంకటరమణ, ఆనకాపల్లి జిల్లా ఏస్సి సెల్ చైర్మన్ గారా అర్జున్, పావని పాల్గొన్నారు.
అనకాపల్లి: అనకాపల్లిలోని ఉత్తరాంధ్ర చర్చ వేదిక కార్యాలయంలో చర్చ వేదిక నాయకులు బుద్ధ రాజేష్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు మహిళగా ప్రపంచంలోనే ఇందిరాగాంధీ పేరు తెచ్చుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డేడ వెంకటరావు, బుద్ధ భగవాన్, పెట్ల నాగేశ్వరరావు, బుద్ధ రాధ, ద్రాక్షారపు పరదేశి నాయుడు, పిన్నింటి కనకారావు, బుద్ధ శంకర్ పాల్గొన్నారు.
కశింకోట : కశింకోట మెయిన్ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కత్తిర శ్రీధర్, బోయిన భానుమూర్తి, మలపురెడ్డి కోటేశ్వరరావు, సూరిశెట్టి ఆదిబాబు, కాళ్ళ వెంకట సత్యనారాయణ, ఊడిగల నరసింహారావు, బి.బాల మురళీ పాల్గొన్నారు. మండలంలోని తాళ్ళపాలెం శాఖా గ్రంథాలయంలోనూ ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పరవాడ : పరవాడలో ఇందిరా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌ఆర్.నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం పాఠశాలలో కేకే కట్ చేసి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు.
సబ్బవరం : మండలంలోని శాఖ గ్రంథాలయంలో ఇందిరాగాంధీ జయంతి చిత్ర పటానికి ఎంఈఒ ఎస్.అప్పలరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు టి.నాగమణి, ఉమాదేవి, గ్రంధాలయాధికారి రమణ పాల్గొన్నారు.










