జెండా అందజేస్తున్న విద్యార్థులు
ఘనంగా హర్ ఘర్ తిరంగ..
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :మండలంలోని సౌత్ ఆములూరు ప్రాథమికో న్నత పాఠశాలలో సోమవారం ఆజాదిక అమత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అత్యంత ఘనంగా ''హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు షేక్ అహ్మద్ బాషా, సర్పంచ్ సరళ కుమారికి, సొసైటీ డైరెక్టర్ మద్దెన వెంకట సుబ్బానాయుడు, గ్రామస్తులకు జాతీయ పతాకాలను అందజేయడం జరిగింది. గ్రామంలోని ప్రతి ఇంటి పైన జాతీయ పతాకాన్ని ఎగు రవేయాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు పాఠశాల ఉపా ధ్యాయులు తెలియజేయడం జరిగింది. పాఠశాలకు జాతీయ పతాకాలను, బహుమతులను అందజేసిన బెస్తవారిపేట, కొటాక్ మహేంద్ర బ్యాంక్, (ప్రకాశం జిల్లా, బ్రాంచ్ మేనేజర్) షేక్ అబ్దుల్ మునాఫ్‌ను హెచ్.ఎం అహ్మద్ బాషా, ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె. హిప్సి, విద్యులత, బి. కష్ణవేణి, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.










