హనుమంతు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నాయకులు
ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఉపాధ్యాయ ఉద్యమ నేత, సిపిఎం నాయకులు హనుమంతు రెండో వర్థంతి సభ సోమవారం సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గసభ్యులు తిప్పన్న అధ్యక్షతన జరిగింది. అంతకుముందు హనుమంతు చిత్రపటానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మన్న, తిప్పన్న, వీరేష్ మాట్లాడారు. ఉపాధ్యాయ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉపాధ్యాయ ఉద్యమాన్ని విస్తరిస్తూ యుటిఎఫ్ స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు. విద్యార్థి, యువజన, దళితుల సమస్యలపై పోరాటాలు చేస్తున్న సంఘాలకు అండగా ఉంటూ పోరాటాలకు సహకారం అందించే వారని కొనియాడారు. హనుమంతు ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.










