ప్రజాశక్తి - టి.నరసాపురం
విద్యార్థులు బాల్యం నుంచే హిందీ భాష పట్ల ఆసక్తి పెంచుకోవాలని టి.నరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిఎల్.స్వామి తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బండివారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలల్లో హిందీ భాష దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ 1949 సెప్టెంబర్ 14న భారత ప్రభుత్వం హిందీని జాతీయ భాషగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు హిందీ భాష ప్రాముఖ్యతను గుర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌విజి .కృష్ణారావు, కె.కుటుంబరావు, ఎం.నాగేశ్వరరావు, నారాయణ పాల్గొన్నారు.
ముదినేపల్లి : ముదినేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్‌లో గురువారం హిందీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌టిఎం మేళా నిర్వహించారు. ఈ మేళాలో హిందీ ఆవశ్యకతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో హేమ రేవంత్, కీర్తి, దివ్య, షేక్ కరీమున్నీసా ఇతర విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం వై.విజరుకుమార్, సూర్యనారాయణరాజు, చంద్రిక పాల్గొన్నారు.










