Oct 24,2023 23:02

ప్రభాస్‌ పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్న ఫ్యాన్స్‌

ప్రజాశక్తి-సీతమ్మధార : విశాఖ సిటీ వైడ్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన మద్దిలపాలెం కిన్నెర - కామేశ్వరి థియేటర్‌ ఆవరణలో ప్రముఖ హీరో ప్రభాస్‌ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసిపి ఉత్తర నియోజక వర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు ముఖ్య అతిథిగా హాజరై కేకు కట్‌ చేశారు. అనంతరం అభిమాన సంఘం నాయకులు మాట్లాడుతూ, త్వరలో రానున్న సలార్‌, కల్కి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ అవుతాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, థియేటర్‌ సిబ్బంది పాల్గొన్నారు.