Apr 07,2023 23:49

హుకుంపేటలో సిలువలను చూపుతున్న క్రైస్తవులు

ప్రజాశక్తి- హుకుంపేట: స్థానిక పరిశుధ్ద ధామస్‌ ప్రార్థన మందిరంలో గుడ్‌ ఫ్రైడేను ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానించారు. క్రైస్తవ సిలువను పట్టుకొని ప్రదర్శన చేపట్టారు.స్థానిక పాస్టర్‌ కే జేమ్స్‌ మాట్లాడుతూ,కల్వరి సిలువలో ఏసుక్రీస్తు చూపించిన త్యాగం, ప్రేమ, దయ గుణం కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రైస్తవ సోదరులు, క్రైస్తవ సంఘ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.
పాడేరు:గుడ్‌ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు ప్రార్ధన మందిరాల్లో క్రైస్తవులు శుక్రవారం ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలను నిర్వహించారు. ఉపవాస ప్రార్థనలతో పట్టణంలోని అన్ని చర్చిలలో క్రైస్తవులు ఆరాధన కార్యక్రమాల్లో నిమగమయ్యారు. ఏసుక్రీస్తు సిలువలో చెప్పిన మాటలను పాస్టర్లు వివరించారు. సెయింట్‌ ఆన్స్‌ చర్చ్‌ ఫాదర్స్‌, సిస్టర్స్‌ సిలువతో చర్చి ప్రాంగణానికి ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని కారుణ్య చర్చ్‌, పలు ప్రార్థనా మందిరాల్లో పాస్టర్లు సందేశం ఇచ్చారు 8న ఉదయం పాడేరు పట్టణంలో రన్‌ ఫర్‌ జీసస్‌, 9న ఈస్టర్‌ సండే ఆరాధనకు క్రైస్తవ సహౌదరులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
విఆర్‌.పురం :
మండలంలోని సంతపాకల వద్ద షాలోమ్‌ ప్రేయర్‌ హౌస్‌ మందిరంలో గుడ్‌ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ప్రత్యేక ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఉపవాస ప్రార్థనలతో మండలంలో అన్ని చర్చిలలో క్రైస్తవులు ఆరాధన కార్యక్రమాల్లో నిమగమయ్యారు. ఏసుక్రీస్తు ఆత్మార్పణను, సిలువ వేయబడిన తర్వాత ఏసుక్రీస్తు మాటలను, మానవాళి శ్రేయస్సు కోసం క్రీస్తు చేసిన ప్రబోధనలను పాస్టర్లు డేవిడ్‌ సుదీర్ఘంగా వివరించారు. ఈ నెల 9న ఆదివారం ఈస్టర్‌ సండే ఆరాధన కార్యక్రమాల నిర్వహణకు మండలంలోని క్రైస్తవ సహౌదరులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.