ప్రజాశక్తి - యంత్రాంగం జిల్లావ్యాప్తంగా కొద్దిరోజులులు నిర్వహిస్తున్న గ్రంథాయల ఉత్సవాలు సోమవారం ముగిశాయి. కాకినాడ స్థానిక వివేకానంద పార్క్‌లో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్ మాట్లాడారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ ఎం.శ్రీనివాసరావు, ఉపాధ్యాయిని శ్రీలక్ష్మి పాల్గొన్నారు. పెద్దాపురం మహారాణి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వీరయ్య చౌదరి సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జోష్యుల కృష్ణబాబు, గౌరవాధ్యక్షుడు చల్లా విశ్వనాథం శాఖా గ్రంథాలయంలో ముగింపు సభలో మాట్లాడారు. పాలంకి నాగరాజు, భళ్లమూడి సూర్యనారాయణ మూర్తి, హెచ్‌ఎం టిఎల్.శివ జ్యోతి, అల్లంరాజు పాల్గొన్నారు. సామర్లకోట శాఖా గ్రంథాలయంలో లైబ్రేరియన్ బందిల రత్నమణి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు పాల్గొన్నారు. అనంతరం పలు పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నాయకుడు సుబ్బారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉబా జాన్ మోజెస్, గోకిన సునేత్రా దేవి, కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ, హెచ్‌ఎం తోటకూర సాయి రామకృష్ణ, తాండ్ర శ్యామ్ కుమార్, ఉపాధ్యాయులు మణికంఠ బాలమురళీకష్ణ, వైసిపి నాయకులు పాలికి చంటిబాబు, ఆంటోనీ, యార్లగడ్డ రాజేష్, ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయానికి సొంత భవనం మున్సిపల్ స్థలంలో ఏర్పాటు చేయాలని తదితర సమస్యలపై చైర్మన్ దొరబాబుకు గ్రంథాలయ అధికారి బందిల రత్నమణి వినతిపత్రం అందజేశారు. యు.కొత్తపల్లి ఉప్పాడలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు ఘనంగా నిర్వహించారు. ఎంఇఒ వేణుగోపాల్, సచివాలయ కన్వీనర్ ఉమ్మిడి జాన్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రంథాలయ అధికారి టి.నళినీ ప్రియ పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్ ప్రముఖ విద్యావేత్త ఒమ్మి రఘురామ్, సచివాలయాల కన్వీనర్ బండారు రాజా ముగింపు ఉత్సవంలో మాట్లాడారు. లైబ్రేరియన్ ఉదయ భాస్కర్, బచ్చల సుధీర్, తోలేటి సూర్యనారాయణ, చంద్రమౌళి, వెంకట శాస్త్రి, నీలపల్లి అప్పారావు, పచ్చిపులుసు వీరబాబు, దత్తి శ్రీనివాసు, కట్టు రాజు పాల్గొన్నారు. కరప వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఫణీంద్ర కుమార్, సర్పంచ్ సాదే ఆశాజ్యోతి పాల్గొన్నారు. గురజానపల్లిలో హెచ్‌ఎం మోహన్, ఐవి.ప్రసాద్ రావు, వివి.రమణమూర్తి, వేళంగిలో మెర్ల వీరయ్యచౌదరి, డాక్టర బొండా వెంకన్నరావు, కూరపాటి సత్తిబాబు పాల్గొన్నారు.