Nov 18,2023 19:31

దేవనకొండలో బహుమతులు ప్రదానం చేస్తున్న నిర్వాహకులు

ప్రజాశక్తి - దేవనకొండ
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా దేవనకొండలోని ఎఫ్‌ఆర్‌ హైస్కూల్‌లో గ్రంథాలయ వారోత్సవాల్లో ఘనంగా జరిగాయి. శనివారం పాఠశాలలోని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. ఉచ్చీరప్ప, కరస్పాండెంట్‌ పి.రఘునాథ మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని తెలిపారు. మంచి పుస్తకాలు ఎక్కడ దొరికినా వాటిని కొనుగోలు చేసి ఇళ్లల్లో జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. పుస్తకాలను ఎంత ఎక్కువగా చదివితే అంత తెలివితేటలు పెరుగుతాయని తెలిపారు. గ్రంథాలయ అధికారి వెంకటరమణ, ఉపాధ్యాయులు వీర ప్రకాష్‌, రంగస్వామి, పాండురంగడు, గోపాల్‌, పి.శ్రావణి, స్రవంతి, లక్ష్మి పాల్గొన్నారు. ఆదోని ఆర్ట్స్‌ కళాశాలలో పుస్తక ప్రదర్శనను ప్రిన్సిపల్‌ మురళీ మోహన్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ సురేష్‌ ప్రారంభించారు. విద్యార్థులు పుస్తక ప్రదర్శనను తిలకించారు. లైబ్రేరియన్‌ వేణుగోపాల్‌, అసిస్టెంట్‌ సుధాకర్‌ పాల్గొన్నారు. పెద్దకడబూరులో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. 15న మండల శాఖ లైబ్రేరియన్‌ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో డ్రాయింగ్‌, పదాల అంత్యాక్షరి, కథలు చెప్పడం, మ్యూజికల్‌ చైర్స్‌, పద్యాలు చెప్పడం తదితర ఆటల పోటీలు నిర్వహించారు. సర్పంచి మల్లమ్మ, ఉప సర్పంచి హుస్సేన్‌, నాయకులు ఆంజనేయులు పాల్గొని బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విక్టోరియమ్మ అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయులు నాగరాజ్‌, సుజాత, శివకుమార్‌ పాల్గొన్నారు.

ఆదోని ఆర్ట్స్‌ కళాశాలలో పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్న సిబ్బంది
ఆదోని ఆర్ట్స్‌ కళాశాలలో పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్న సిబ్బంది