Nov 16,2023 18:20

ప్రజాశక్తి - నరసాపురం
           వైఎన్‌ కళాశాల యుజి గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయాలు వాటి ప్రయోజ నాలు అంశంపై గురువారం వ్యాస రచన పోటీలు నిర్వహించారు. నరసాపురంలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 30 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చింతపల్లి కనకారావు పర్యవేక్షించి గెలిచిన వారికి ముగింపు ఉత్సవాల్లో బహుమతులను అందిస్తామని చెప్పారు. గ్రంథాలయ అధికారి జి.కోటయ్య కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్‌ డాక్టర్‌ గంధం రామకృష్ణ, భూగోళ శాస్త్ర విభాగం అధ్యాప కులు బిఎన్‌ఎస్‌వి.ప్రసాద్‌, తెలుగు అధ్యాపకులు ఎస్‌.యా కోబు, గ్రంథాలయ అధికారిని జి.విజయలక్ష్మి పాల్గొన్నారు.
పెనుమంట్ర :జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మార్టేరు రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో 140 మంది విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశంపై గురువారం చిత్రలేఖన పోటీలు నిర్వహించినట్లు గ్రంథాలయ అధికారి పిటి.శివకుమార్‌ తెలిపారు. ఈ కార్య క్రమానికి మానవత పెనుమంట్ర శాఖ అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా మానవత ఆత్మీయ సహకార కమిటీ ఛైర్మన్‌ చిర్ల శ్రీనివాస్‌రెడ్డి, రోటరీ అధ్యక్షులు గుడిమెట్ల లక్ష్మణరెడ్డి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల రామారెడ్డి, రీడర్స్‌ ఫోరం మానవత కమిటీ సభ్యులు పడాల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
వీరవాసరం : స్వాతంత్య్ర ఉద్యమంలో గ్రంథాలయాల పాత్ర ప్రముఖమైందని గ్రంథ పాలకుడు బత్తుల హనుమంతరావు అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళి అర్పించారు. శెట్టిబలిజ పేట ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యమ పితామహులు పాతూరి నాగభూషణం, అయ్యింకి వెంకటరమణయ్య, ఎస్‌ఆర్‌.రంగనాథ్‌ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డి.శ్రీనివాస్‌, అంగన్‌వాడీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పాలకోడేరు :గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ నేతలకు గొల్లలకోడేరు గ్రంథాలయం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు చెస్‌ పోటీలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నెహ్రూ, గ్రంథాలయ అధికారి జి.బాలరాజు పాల్గొన్నారు.
ఉండి : గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్నవారికి ఉండి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి జెవి.కృష్ణమూర్తి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఉండి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ధూమపానం మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సైకాలజిస్ట్‌ కాట్రు చిన్నవీర్రాజు, నల్లా సత్యకృష్ణకిరణ్‌ ప్రసాద్‌ హాజరయ్యారు.
గణపవరం : మండలంలోని పిప్పర గ్రంథాలయంలో వారి చిత్రపటాలకు స్థానిక పెద్ద దండు సూర్యనారాయణరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిప్పర హైస్కూల్‌ ఇన్‌ఛార్జి హెచ్‌ఎం ఆంజనేయులు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఐవి.నరసింహరాజు, జివి.కృష్ణారావు, గ్రంథ పాలకులు పి.రంగారావు పాల్గొన్నారు.