ప్రజాశక్తి - ఆస్పరి
ఆస్పరిలోని గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం గ్రంథాలయ పితామహుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటాలకు సొసైటీ ఛైర్మన్ గోవర్ధన, వైసిపి మండల కన్వీనర్ పెద్దయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులు, పాఠకులు గ్రంథాలయాన్ని వినియోగించుకొని మంచి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ స్థాయిలో కూడా డిజిటల్ గ్రంథాలయ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. సొసైటీ సిఇఒ అశోక్, వైసిపి నాయకులు ప్రకాష్, తిమ్మప్ప, రాజన్న గౌడ్, సచివాలయ కన్వీనర్ రామకృష్ణారెడ్డి, శంకర్, నరసింహులు, నారాయణ, శివ కోటి పాల్గొన్నారు. పెద్దకడబూరు గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను గ్రంథాలయ అధికారిని కె.ఆశాజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. నెహ్రూ జయంతి సందర్భంగా ఎంఇఒ-2 బి.రామ్మూర్తి, ఆశాజ్యోతి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.