55వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం గ్రంథాలయ ఉద్యమకారుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రంథాలయాల్లో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు.
ప్రజాశక్తి- చోడవరం
చోడవరం శాఖా గ్రంధాలయంలో బుధవారం గ్రంథాలయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన నాయకుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అయ్యంకి వెంకట రమణయ్య, ఎస్‌ఆర్ రంగనాథ్, గాడిచర్ల హరిసర్వోత్తమరావు చిత్రపటాలకు పూలమాల నివాళులర్పించారు. వివిధ పాఠశాలలు నుండి వచ్చిన విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గ్రంథాలయాధికారి జి.తిరుమల కుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కె.కోటపాడు : గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక శాఖా గ్రంథాలయం వద్ద విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ ఉద్యమకారుల సంస్కరణ దినోత్సవాన్ని నిర్వహించి, ఎస్‌ఆర్.రంగనాథ్. అయ్యంకి వెంకట రమణయ్య, పాతూరి నాగభూషణం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని కె.సౌమ్య, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కశింకోట : తాళ్ళపాలెం శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ ఉద్యమ నాయకులు అయ్యంకి వెంకట రమణయ్య, పాతూరి నాగభూషణం, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, ఎస్‌ఆర్. రంగనాథం చిత్రపటాలకి పూలమాలవేసి నివాళులర్పించారు. వారు చేసిన సేవలు గుర్తు చేశారు. అనంతరం విద్యార్థులకు జూనియర్ సీనియర్ విభాగాల్లో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు లగిశెట్టి గణేష్, ఉపాధ్యాయులు ఎల్.వరలక్ష్మి, ఎంవికె.హరినాధ్, గ్రంథాలయ అధికారులు కె.జగన్, ఎస్.వరలక్ష్మి పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : స్థానిక శాఖ గ్రంథాలయంలో బుధవారం డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జాజి మొగ్గల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి వి.కృష్ణారావు ఉపాధ్యాయులు అప్పారావు పాల్గొన్నారు.
మునగపాక రూరల్ : స్థానిక శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ ఉద్యమ నేతల చిత్రపటాలకు మండల విద్యాశాఖ సిఆర్‌పి అచ్యుత కృష్ణ, ప్రణతి విద్యానికేతన్ కరస్పాండెంట్ సతీష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఉపాధ్యాయులు శివకోటి దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో నిర్వహించారు. గ్రంథాలయాధికారి ఎల్వి రమణ, ఉపాధ్యాయులు పి చక్రవర్తి, వినరు, గణేశు సిబ్బంది దివ్య పాల్గొన్నారు.
సబ్బవరం : స్థానిక శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను స్థానిక సిఐ పి.రంగనాథం ప్రారంభించారు. గ్రంథాలయాధికారి పి.వి.రమణ అధ్వరంలో గ్రంధాలయ ఉద్యమ నాయకులు చిత్రపటాలకు సిఐ రంగనాథం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జి.డేవిడ్ సురేష్, బి.సింహాద్రి, పాఠకులు పాల్గొన్నారు.
అనకాపల్లి : గ్రంథాలయ పితామహుడు వెంకట రమణయ్య సేవలు చిరస్మరణీయమని సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బల్ల నాగభూషణం అన్నారు. స్థానిక శాఖవీధి శాఖ గ్రంథాలయంలో బుధవారం వెంకట రమణయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వికలాంగులకు వక్తృతం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. గ్రంథాలయ అధికారి కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నక్కపల్లి : మండలంలోని చినదొడ్డిగల్లు గ్రంథాలయంలో గ్రంధాలయ అధికారి జనార్దన్ ఆధ్వర్యంలో బుధవారం గ్రంథాలయోద్యమకారులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నీలకంఠ కుమార్, శ్రీదేవి, భవాని, నాగాచారి, వెంకటేశ్వరరావు, రామ సీత తదితరులు పాల్గొన్నారు. నక్కపల్లి గ్రంథాలయంలో గ్రంధాలయ అధికారి గోవింద ఈశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన ఫోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
రావికమతం : మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో బుధవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని మాలతి, సిద్ధార్థ హైస్కూల్ ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు.
రోలుగుంట : స్థానిక శాఖా గ్రంధాలయంలో వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు గ్రంధాలయాధికారి ఎస్.వరలక్ష్మీ తెలిపారు. రోలుగుంట, కొవ్వూరు, కొమరవోలు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, కస్తూర్భా గాంధీ పాఠశాలల విద్యార్ధులు పాల్గొన్నారు.
కోటవురట్ల : శాఖ గ్రంధాలయంలో గ్రంథాలయ ప్రముఖులకు నివాళులు అర్పించారు. అనంతరం పలు పాఠశాలల విద్యార్థులకు గ్రంథాలయ అధికారి అప్పలనాయుడు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.










