Nov 10,2023 00:00

ప్రజాశక్తి - అద్దంకి
ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బలిజపాలెం, టిడిపి పట్టణ అధ్యక్షులు, క్లస్టర్, వివిధ స్థాయిల్లోని టిడిపి నాయకులు టిడిపి కార్యాలయాలలో పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. టిడిపి నాయకులు  పట్టణంలో స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పుట్టినరోజు వేడుకలను ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజలు చేశారు.


సంతమాగులూరు : మండలంలోని పుట్టావారిపాలెం అడ్డరోడ్డు జంక్షన్ సమీపంలోని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అతిథి గృహంలో టిడిపి మండల అధ్యక్షులు గాడిపర్తి వెంకటరావు ఆధ్వర్యంలో రవికుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. రానున్న ఎన్నికలలో రవికుమార్ ఘన విజయం సాధించాలని నేతలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ధూపాటి ఏసోబు, పెరుమాళ్ళ వీరయ్య, పసుపులేటి కోటేశ్వరరావు, కొనికి శ్రీనివాసరావు, మురళి, కామాను శ్రీనివాసరావు, జిర్రా బాబురావు పాల్గొన్నారు.


పంగులూరు : అద్దంకి ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ పుట్టిన రోజు సందర్భంగా టిడిపి కార్యకర్తలు అయ్యప్పస్వాములకు అన్నదానం చేశారు. జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. పంగులూరులో కేక్ కట్ చేసి గొట్టిపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి మండల అధ్యక్షులు రావుల రమేష్ బాబు, టిడిపి పంగులూరు గ్రామ అధ్యక్షుడు బాచిన త్రివేణిబాబు, కుర్రా వెంకటరావు, వడ్డంపూడి శ్రీకాంత్, చిలుకూరి నాగేశ్వరరావు, పొద వీరాంజనేయులు పాల్గొన్నారు. ముప్పవరంలో రవికుమార్ జన్మదిన సందర్భంగా స్థానిక పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వాములకు, శివ స్వాములకు, దీక్షపరులు అందరికీ అన్నదానం  చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కుక్క పల్లి ఏడుకొండలు, గరిమిడి జగన్మోహన్‌రావు, ఇంటూరి రామకృష్ణ, టిడిపి గ్రామ అధ్యక్షుడు రౌతు వీరాంజనేయులు, యార్లగడ్డ సాంబయ్య, అల్లమనేని బ్రహ్మానందస్వామి పాల్గొన్నారు.


మేదరమెట్ల : ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక  బొడ్రాయి సెంటర్ వద్ద కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తొలుత బొడ్రాయికి పూజలు చేశారు. టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మన్నే రామారావు గొట్టిపాటి జన్మదిన కేకును కట్ చేశారు. అక్కడకు చేరిన అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో మెదరమెట్ల శ్రీనివాసరావు, చెన్నూపాటి హరిబాబు, మంద నాగేశ్వరరావు, శేషయ్య, అరవింద్, కోటేశ్వరరావు, మంద ఆమోసు పాల్గొన్నారు.