ప్రజాశక్తి-మాడుగుల:స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ సివిఎస్‌ఎస్ శాస్త్రి పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు విజ్ఞానాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గణతంత్ర దినంపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జయలక్ష్మి, అధ్యాపకులు షర్మిల, పైడిరాజు, రమణమూర్తి, సులోచన, రామ్‌కుమార్, నారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు
నక్కపల్లి :మండలంలోని గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల్ పరిషత్ కార్యాలయం వద్ద ఈఓపిఆర్‌డి వెంకటనారాయణ, వైసిపి కార్యాలయం వద్ద రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, సచివాలయాల వద్ద పంచాయతీ కార్యదర్శులు, పాఠశాలల్లో హెచ్‌ఎంలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులకు స్వీట్స్, చాక్లెట్లు పంచి పెట్టారు. డిప్యూటీ కలెక్టర్‌గా ప్రమోషన్ పొందిన తహసీల్దార్ సుబ్రమణ్యం శాస్త్రి కు మండల పరిషత్ కార్యాలయం వద్ద వీసం రామకృష్ణ, ఎంపీపీ రత్నం, వైస్ ఎంపీపీ నానాజీ, అధికారులు వెంకటనారాయణ, డివిడి ప్రసాద్ తదితరులు ఘనంగా సత్కరించారు.
నర్సీపట్నం టౌన్:స్థానిక ఎన్టీఆర్ మినిస్ట్రీలోని గాంధీజీ విగ్రహం వద్ద లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ముఖ్యఅతిథిగా డిసిసిబి చైర్ పర్సన్ చింతకాయల అనిత భర్త సన్యాసిపాత్రుడు పాల్గొన్నారు. పాడుతా తీయగా విన్నర్ ధీరజ్ వందేమాతర గీతాన్ని ఆలపించాడు. ఈ సందర్భంగా సన్యాసిపాత్రుడు మాట్లాడుతూ, నర్సీపట్నంకి చెందిన ధీరజ్ వందేమాతరం గీతానికి ఐదు చరణాలు జోడించి పాడటం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త వెలగ నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.
కోటవురట్ల: మండలంలో తహసిల్దారు జానకమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర్, కోటవురట్ల కార్యదర్శి సుబ్రహ్మణ్యం, వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు జెండాలను ఎగరవేశారు. జడ్పిటిసి సభ్యురాలు ఉమాదేవి, బీసీ సెల్ అధ్యక్షుడు పైల రమేష్ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రాముఖ్యతను విరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సోమశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
అవంతి కళాశాలలో
మాకవరపాలెం : స్థానిక అవంతి కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ సి.మోహన్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అందరికీ -సమన్యాయం జరిగేటట్టు భారత రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. ఈ కార్యర్కమంలో బేసిక్ సైన్సెస్ శాఖాధిపతి డాక్టర్ శ్రీనివాసరావు, ఎన్‌సిసి కోఆర్డినేటర్ హరికృష్ణ, అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
మండలంలో తహసిల్దార్ ప్రసాద్‌రావు. ఎంపీడీవో అరుణశ్రీలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
పాయకరావుపేట:పాయకరావుపేట కనోసా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ పతాకాన్ని ప్రిన్సిపాల్ సిస్టర్స్ సోఫియా ఎగురవేశారు విద్యార్థుల పిరమిడ్స్ ఆకట్టుకున్నాయి. మండలంలో జరిగిన వేడుకల్లో ఎంపీపీ పార్వతి తాతారావు, జడ్పిటిసి లంక సూర్యనారాయణ, ఎంపీడీవో సాంబశివరావు పాల్గొన్నారు.
రోలుగుంట:మండలంలో ఎంపిడిఒ ప్రభాకరరావు, తహశీల్దార్ వెంకటేశ్వరరావు, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై నాగకార్తీక్ జాతీయ జెండాను ఎగురవేశారు. కేజిబివితోపాటు అన్ని పాఠశాలల్లో గణతంత్ర వేడుకలు జరిగాయి. శరభవరం గ్రామంలో మండల ఉపాధ్యక్షులు సియాద్రి రాజుబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
గొలుగొండ:మండలంలో తహశీల్దార్ ఆనందరావు, ఎస్సైలు నారాయణరావు, నారాయణరావు జెండాలను ఆవిష్కరించారు. కేడిపేట అటవీశాఖ కార్యాలయం వద్ద డిఆర్‌ఓ, ఎంపిడిఒ కార్యాలయం వద్ద డేవిడ్‌రాజు జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మణికుమారి, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
రావికమతం:మండలంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో వెంకన్నబాబు, ఎంపీపీ పైలరాజులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పరవాడ: మండల పరిషత్ కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకల్లో ఎంపిపి పైల వెంకటపద్మ లక్ష్మీ శ్రీనివాసరావు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వి ప్రకాష్‌రావు,. పోలీసు స్టేషన్లో సిఐ పి ఈశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశభక్తి గీతాలు ఆలపించారు, కార్యక్రమంలో ఎంపిడిఒ హేమసుందరరావు, వైస్ ఎంపిపి బంధం నాగేశ్వరరావు, సర్పంచ్ సిరిపురపు అప్పల నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, ఉప సర్పంచ్ బండారు రామారావు, తిక్కవానిపాలెం ఎంపటిసి సురాడ బంగారు రాజు, మండల పార్టీ అధ్యక్షులు కోన రామారావు రెడ్డి శ్రీనివాసరావు, కావలి రాజు, వార్డు మెంబెర్ పోతాల అప్పలనాయుడు, పైల హరీష్‌పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : మండలంలోని మండల పరిషత్ వద్ద ఎంపిడిఒ సువర్ణరాజు, రెవెన్యూ కార్యాలయంలో తహసిల్దార్ ఎస్‌వి అంబేద్కర్, ఎస్‌ఐ కుమారస్వామి జాతీయ జెండా ఆవిష్కరించారు. దిబిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్ ప్రతినిధులు, సుతపల్లి బద్రీనాథ్ ముమ్మిడిశెట్టి శ్రీనివాసరావు, ప్రకాష్ సమకూర్చిన పెన్నలు, నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు.
చోడవరం : మండల రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ తిరుమలబాబు, పోలీస్ స్టేషన్‌లో సిఐ శ్రీనివాసరావు, సుగర్ ఫ్యాక్టరీ వద్ద ఎండి సన్యాసినాయుడు, కోర్టు ప్రాంగణంలో సీనియర్ సివిల్ జడ్జి ఎస్.అరుణశ్రీ పంచాయితీ కార్యాలయం వద్ద ఇఒ నారాయణరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కశింకోట : మండల పరిషత్ వద్ద గణతంత్ర వేడుకల్లో ఎంపిడిఒ కొంకి అప్పారావు జెండాను ఆవిష్కరించారు. ఎంపిపి కలగా లక్ష్మి, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు పెంటకొట జ్యోతి సర్పంచ్‌కలగా గున్నయ నాయుడు, మంత్రి జయరజనీ వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సెయింట్ జాన్స్ స్కూల్‌లో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డైరెక్టర్ బత్తుల నోబెల్‌కుమార్, కరస్పాండెంట్ బత్తుల అనురాధ, హెడ్ ఇన్‌చార్జి రూపానంద్, ప్రిన్సిపాల్ మహేష్ పాల్గొన్నారు తాళ్ళ పాలెంలో ఎంపిటిసి లగిశెట్టి భవానీ, లగిశెట్టి గణేష్ కార్యదర్శి వెంకటలక్ష్మీ పాల్గొన్నారు
కె.కోటపాడు : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిఇఒ శచిదేవి, తహశీల్దార్ కార్యాలయం వద్ద డిటి రమేష్ బాబు, స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద సబ్ రిజిస్టర్ వెంకటేశ్వరరావు జాతీయ జెండాలను ఎగుర వేశారు. చౌడువాడ, కే కోటపాడు, ఎ. కోడూరు తదితర గ్రామాల పాఠశాలలు, సచివాలయాల వద్ద హెచ్‌ఎంలు, సచివాలయకార్యదర్శుల ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి.
మునగపాక రూరల్: ప్రజాపరిషత్తు, తహశీల్దార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామపంచాయతీ, ప్రాథమిక సహకార సంఘం , గౌతమీ పఠన మందిరం, గ్రామీణ యువజన మందిరం, జిల్లా పరిషత్తు పాఠశాలలలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
దేవరాపల్లి : ఎ.కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం వై. స్వర్ణలత ఆధ్వర్యంలో విద్యార్థులు త్రివర్ణ పతాకంతో విద్యార్థుల అద్భుత విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చింత సత్య వెంకటరమణ, జి. సంధ్యారాణిపాల్గొన్నారు.
అచ్యుతాపురం : మండల పరిషత్ వద్ద ఎంపిడిఒ విజయలక్ష్మి, పోలీస్‌స్టేషన్ వద్ద సిఐ వై.మురళీరావు, రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ వై.శ్రీనివాసరావు, జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. స్వామి వివేకానంద వికలాంగుల యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిపారు. వికలాంగులకు కృత్రిమ అవయవాలను అధ్యక్షులు మెరుగు నూకరాజు అందజేశారు.
సబ్బవరం : మండల పరిషత్ వద్ద ఎంపిడిఒ రమేష్‌నాయుడు, తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి. సత్యనారాయణ, పోలీస్‌స్టేషన్ వద్ద సిఐ పి.రంగనాథ్, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం లో ఉపకులపతి ప్రొఫెసర్. ఎస్. సూర్యప్రకాష్, స్థానిక అంబేద్కర్ గురుకులంలో ప్రిన్సిపాల్ కె. విజయకుమార్, పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ డి. ప్రసాదరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపిపి సూర్యకుమారి రామునాయుడు, జెడ్‌పి వైస్‌చైర్మన్ తుంపాల అప్పారావు, ఎంఇఒ ఎస్.అప్పల రాజు, ఇఒపిఆర్‌డి మహేష్, వైసిపి నేతలు కోటాన రాము, సబ్బవరపు ముత్యాల నాయుడు, సాలాపు వెంకటేశ్వరరావు, బంతికోళ్ల పద్మ పాల్గొన్నారు.










