Sep 01,2022 23:24

భీమిలిలో అన్నక్యాంటీన్‌ తరహా మండపంలో కొలువైన మట్టి గణపయ్య

ప్రజాశక్తి -భీమునిపట్నం     జివిఎంసి నాలుగో వార్డు చేపలుప్పాడలో అన్యాక్యాంటీన్‌ నమూనాలో తీర్చిదిద్దిన మండపంలో మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగో వార్డు టిడిపి అధ్యక్షులు, మాజీ ఎంపిపి పాసి నరసింగరావు సొంత నిధులు, రూ.50వేలతో వినూత్నంగా రూపొందించిన ఈ మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉత్సవాల సందర్భంగా భక్తులకు, అనాధలకు నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు, తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షులు పాసి త్రినాధ్‌కుమార్‌, మాజీ సర్పంచ్‌ కారి అప్పారావు, మాజీ ఎంపిటిసి చీపుళ్ళ శ్రీనివాస్‌, పార్టీ నాయకులు మైలపల్లి రాము పాల్గొన్నారు.
కంచరపాలెం : 53వ వార్డు సాయినగర్‌ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో వరసిద్ధి వినాయకుని పంచరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం ప్రధాన అర్చకులు అందుకూరు శివాజీశర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చనలు నిర్వహించారు. విగ్రహదాత సురభి వెంకటరావు, సాయినగర్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.
కరాస : 52వ వార్డు శాంతినగర్‌ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి శాంతినగర్‌ యువజన నాయకుడు జియ్యని విజరుకుమార్‌, సభ్యులు తీర్థప్రసాదాలు అందజేసి, దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రములో ఉత్సవ కమిటీ సభ్యులు అత్తిలి సురేష్‌కుమార్‌, చరణ్‌, జనార్ధన్‌ నాయుడు, నూకరాజు, వంశీ పాల్గొన్నారు. వినాయక ఉత్సవాల్లో ఎమ్మెల్యే పి.గణబాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
గాజువాక : అగనంపూడి పునరావాస కాలనీతోపాటు పెనమడక, పెదమడక, దిబ్బపాలెం, పెద్దినాయుడుపాలెం, కొండయ్యవలస, అండమాన్‌ కొండయ్యవలస, దిబ్బపాలెం గ్రామాల్లో నెలకొల్పిన వినాయక మండపాలను టిడిపి విశాఖ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీలు పల్లాను ఘనంగా స్వాగతించగా, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎడిసిి చైర్మన్‌ బలిరెడ్డి సత్యనారాయణ, 85వ వార్డు టిడిపి అధ్యక్షులు కర్రి. దశేంద్ర, స్థానిక టిడిపి నేతలుమువ్వల మహేష్‌ యాదy,్‌ శీరంశెట్టి బాబ్జి, ఈగల పోలినాయుడు, కోల్లి దేవుడు పాల్గొన్నారు.
లంకా మైదానంలో బుధవారం ఎస్‌విఎల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆధ్వర్యంలో నెలకొల్పిన భారీ వినాయక విగ్రహాన్ని బిజెపి ఎంపి జీవీఎల్‌ నరసింహారావు, స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదైన వినాయక విగ్రహాన్ని దర్శించుకునేందుకు ప్రజలు భారీగగా తరలిరావడంతో గాజువాకలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది.
సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గ వైసిపి కార్యాలయం పక్కనే ఏర్పాటు చేసిన భారీ వినాయక మండపాన్ని నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త, నెడ్‌క్యాప్‌ రాష్ట్ర చైర్మన్‌ కె.కె రాజు ఆహ్వానం మేరకు జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున, జివిఎంసి కమిషనర్‌ లక్ష్మీశ సందర్శించారు. ఉత్సవ కమిటీ సభ్యులు డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, 14వార్డు కార్పొరేటర్‌ అనిల్‌కుమార్‌ రాజు, కిరణ్‌ రాజు, ఆళ్ల శివ గణేష్‌, నీలి రవి, అంబటి శైలేష్‌, ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ అల్లు శంకర రావు, కార్పొరేటర్లు పి.ఉషశ్రీ, కెవిఎస్‌..శశికళ, కోఆప్షన్‌ సభ్యులు సేనాపతి అప్పారావు, మాజీ కార్పొరేటర్‌ పోతు సత్యనారాయణ, వార్డు అధ్యక్షులు పైడి రమణ, పీలా వెంకట లక్ష్మీ, పి.సునీత, పాల్గొన్నారు.