ప్రజాశక్తి-పెదబయలు: స్థానిక గిరిజన గురుకుల బాలుర పాఠశాల, ఏకలవ్య పాఠశాలల్లో గురువారం ప్రిన్సిపల్స్ డి.శంకర్‌రావు, ఎం.కేశవరావు అధ్వర్యంలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రామానుజన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మేథ్స్ నమూనాలు విద్యార్దులు ప్రదర్శించారు.
సీలేరు: సీలేరు డిఎవి పాఠశాలలో రామానుజన్ 135 జయంతిని పురస్కరించుకుని గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. డిఎవి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్రావు ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన గణిత మోడల్‌ను రూపకల్పన చేసి ప్రదర్శించారు.ఎపి జెన్‌కో ఎస్‌ఇ సివిల్ కెకెవి. ప్రశాంత్‌కుమార్, ఇఇ జాకీర్ హుస్సేన్ తిలకించి విద్యార్థులను అభినందించారు. గణిత ఉపాధ్యాయులు ఎం.ఫణి శర్మ, బాల నరేష్, శారద, ప్రధానోపాధ్యాయులు రామచంద ర్రావులను జెన్‌కో అధికారులు అభినందించారు.
మారేడుమిల్లి: : మండలంలో దేవరపల్లి ఆశ్రమ బాలుర పాఠశాలలో హెచ్‌ఎం డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రిటైర్డ్ పిజి హెడ్‌మాస్టర్ ది భాష్యం శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై గణిత శాస్త్రంపై పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు బహుమతులను అందజేశారు. దేవరపల్లి పాఠశాల ఉపాధ్యాయులు భాష్యం శ్రీనివాసరావు ఆర్యభట్ట వేద గణిత సంఘం ఏర్పాటు చేసి, తన జీతం నుండి రూ.లక్ష కేటాయించి, బ్యాంకులో వేసి వచ్చిన వడ్డీతో విద్యార్థులకు పోటీలను నిర్వహించి బహుమతులను అందజేస్తున్నారు. గ్రామ సర్పంచ్ లచ్చిరెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










