ప్రజాశక్తి - నగరం
మండలంలోని వివిధ గ్రామాలల్లో వినయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఈదుపల్లి రామమందిరం వద్ధ ఏర్పాటు చేసిన వినయక విగ్రహం వద్ద ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య, ఆయన తనయుడు ఈదుపల్లి సర్పంచ్ చింతల పవన్ కుమార్‌కు వినాయక కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వి మురళి, అనుదీప్, చింతల సుందర బాబు, టి కృష్ణమూర్తి, పి సాయి పవన్, వై సాయి, టి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.










