Jan 22,2023 00:01

రథం లాతున్న ఉత్సత కమిటీ సభ్యులు, ప్రముఖులు

ప్రజాశక్తి-అనకాపల్లి
ఉత్తరాంధ్రలో పేరుగాంచిన వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వర తీర్థ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ రథాన్ని కార్పొరేటర్‌ జాజుల ప్రసన్న లక్ష్మి రమేష్‌ దంపతులు, వైసిపి సీనియర్‌ నాయకులు డాక్టర్‌ జి.రామ్మూర్తి, లీడర్‌ పత్రిక అధినేత వివి రమణమూర్తి లాగి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పట్టణానికి చెందిన వేలాది మంది భక్తులు దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఊరేగింపులో పలు నేలవేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గౌరీ పరమేశ్వరులను దర్శించుకున్న వారిలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ఎంపీ డాక్టర్‌ బివి.సత్యవతి విష్ణమూర్తి దంపతులు, మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైసిపి నాయకులు మందపాటి జానకి రామరాజు, దాడి రత్నాకర్‌, డిఆర్‌ఓ వెంకటరమణ, జోనల్‌ కమిషనర్‌ ఎస్‌ వెంకటరమణ, కార్పొరేటర్‌ పీల సౌజన్య రాంబాబు దంపతులు, పట్టణ సీఐ మోహన్‌ రావు, జనసేన నాయకులు ముక్క శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు బొద్దపు ప్రసాద్‌, ఉమామహేశ్వరరావు, రౌతు సతీష్‌, దోమరోతు రవి, చిరంజీవి, రమణ, గౌరీష్‌, వాకాడ బాబు, మద్దాల కూర్మారావు, బుదిరెడ్ల మురళి, దొండ వెంకటరమణ, కర్రి సత్తిబాబు పాల్గొన్నారు.